NTV Telugu Site icon

Chiranjeevi: గద్దర్ అవార్డుల పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. చిరంజీవి కీలక ట్వీట్

Gaddaer Awards

Gaddaer Awards

[19:11, 7/30/2024] BhaRGV Reddy: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించి కొంత కాలం అవుతోంది. అయినా ఈ అవార్డుల గురించి సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదంటూ తాజాగా రేవంత్ రెడ్డి ఒక సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద గుర్రుగా ఉన్నారంటూ పలు వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చాలా రోజుల నుంచి భావిస్తూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీ పరిశ్రమలోని  ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా  ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు  ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అని అంటూ పేర్కొన్నారు. నిజానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మళ్లీ అవార్డులు ప్రకటించలేదు. అయితే పలు సందర్భాలలో రేవంత్ రెడ్డిని కలిసిన సినీ పెద్దలు ఈ నంది అవార్డులు మళ్ళీ ఇస్తే బాగుంటుందని సూచించారు. ఒక కార్యక్రమంలో నంది అవార్డుల బదులు గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ సినీ పరిశ్రమ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆయన తాజాగా ఆవేదన వ్యక్తం చేశారు.