Site icon NTV Telugu

Renu Desai: తిడితే పవన్ కళ్యాణ్ ను తిట్టండి.. మమ్మల్ని లాగకండి

Renu Desai

Renu Desai

Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చేసిన సినిమాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. కానీ, ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా .. ఇప్పుడు మాజీ భార్యగా ఆమె ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఇక దాదాపు 23 ఏళ్ళ తరువాత టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రేణు రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ప్రమోషన్స్ లో పాల్గొంటూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. సినిమా విషయాలతో పాటు, తన పర్సనల్ విషయాలు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ” నేను ఎప్పుడు విడాకుల గురించి మాట్లాడినా.. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ అభిమానులు.. నేను వేరే పార్టీలకు అమ్ముడుపోయాను అని చెప్పుకొచ్చేవారు. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా మాట్లాడితే .. ఈ పార్టీకి అమ్ముడుపోయాను అని చెప్పుకొస్తున్నారు అంటూ నవ్వేసింది.

Vijay Devarakonda: ఐరనే వంచాలా ఏంటీ .. నెక్స్ట్ టైటిల్ ఇదే..?

“పవన్ కళ్యాణ్.. రాజకీయ నాయకుడు కావాలనుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా ఆయన గురించి కామెంట్ చేయొచ్చు. మేనిఫెస్టో బాగోలేదని, ఆయన మాట్లాడే మాటలు బాగోలేవని.. స్పీచ్ లు బాగోలేవని తిట్టండి.. కానీ అందులోకి కుటుంబాన్ని లాగకండి” అని చెప్పింది. ఇక రేణు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడిన కామెంట్స్ గురించి ఆమె చెప్తూ.. ” ఒక కుటుంబం పరువు మొత్తం ఒక మహిళ రెండు కాళ్ల మధ్య ఉంటుంది అంటే.. అది చాలా దురదృష్టం. నా నటన గురించి కానీ, నా డ్రెస్సింగ్ గురించి కానీ కామెంట్ చేయకుండా.. ఎంతమందితో పడుకుంది.. ఇలా చేసింది.. అలా చేసింది అని క్యారెక్టర్ తో వెళ్ళిపోతారు.. అది పద్దతి కాదు” అని రేణు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version