Renu Desai Intresting Comments on Hemalatha Lavanam Role: మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వంశీ కాంబినేషన్ లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాలో నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, చార్ట్‌బస్టర్ సాంగ్స్ సినిమా మీద హ్యూజ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేస్తున్నాయి. అక్టోబర్ 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాలో కీలకమైన హేమలతా లవణం పాత్ర పోషించిన నటి రేణు దేశాయ్ విలేకరులతో ముచ్చటించి ‘టైగర్ నాగేశ్వరరావు’ విశేషాలని పంచుకున్నారు. హేమలతా లవణం గారిది లార్జర్ దేన్ లైఫ్ పర్సనాలిటీ అని ఆ రోజుల్లోనే చంబల్, బుందేల్ ఖండ్ వెళ్ళి అక్కడ డెకాయిట్లని కలిసి అనేక రిఫార్మ్స్ చేశారని అన్నారు. జోగిని వ్యవస్థపై, అంటరానితనం పై పోరాటం చేశారని హేమలత లవణం ఈ సినిమా ద్వారా యంగర్ జనరేషన్ ఆడియన్స్ లో స్ఫూర్తిని నింపుతారని ఆమె అన్నారు.
Akira Nandan: మెగా ఫ్యాన్స్ కి అఖీరా విషయంలో బ్యాడ్ న్యూస్..
ఇలాంటి గొప్ప పాత్ర చేయడం నా పూర్వజన్మ సుకృతం అని పేర్కొన్న ఆమె అభిషేక్ గారి నిర్మాణంలో పని చేయడం, రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా ఒక గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అన్నిటికంటే హేమలత లవణం పాత్ర పోషించడం నా అదృష్టంగా భావిస్తానని అన్నారు. హేమలత లవణం గురించి తెలుసుకోవడానికి కొంతమందిని కలిశానని ఆమె మేనకోడలు కీర్తిగారిని విజయవాడలో కలవగా ఆమె ఆవిడ గురించి చాలా సమాచారం ఇచ్చారని, ఈ పాత్ర చేసినప్పుడు అవన్నీ సహాయపడ్డాయని అన్నారు. ఆమెలా కనిపించడానికి చాలా నిజాయితీగా ప్రయత్నించా, ఈ పాత్ర నాకు చాలా తృప్తిని ఇచ్చిందని అన్నారు. లైఫ్ లో హేమలతా లవణం గారిని కలవలేక పోవడం అతిపెద్ద రిగ్రెట్ అని పేర్కొన్న ఆమె ఇప్పుడు కనుక ఆమెను కలిసే అవకాశం వస్తే ముందు సాష్టాంగ నమస్కారం చేస్తానని చెప్పుకొచ్చారు.