నిజంగానే వరాల ‘చక్రవర్తి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(సెప్టెంబర్ 8న చక్రవర్తి జయంతి)
తెలుగు చలనచిత్ర సంగీత సామ్రాజ్యంలో పేరుకు తగ్గట్టు చక్రవర్తిలాగానే చరించారు సంగీత దర్శకులు చక్రవర్తి. తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం శాసించారు చక్రవర్తి. ఆ రోజుల్లో ఏవీయమ్ రికార్డింగ్ థియేటర్స్ అన్నిటా చక్రవర్తి సంగీతమే వినిపిస్తూ ఉండేదంటే అతిశయోక్తి కాదు. అగ్రకథానాయకులు మొదలు వర్ధమాన నటుల దాకా అందరి చిత్రాలకు చక్రవర్తి సంగీతమే దన్నుగా నిలిచింది. దాదాపు 800 చిత్రాలకు చక్రవర్తి స్వరకల్పన చేశారు. ఆయన గాత్రం, నటన సైతం పులకింపచేశాయి.
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
మిత్రుల సహకారం…
చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు. ప్రముఖ దర్శకుడు కొమ్మినేని శేషగిరిరావు ఈయన సోదరుడే. అన్నదమ్ములిద్దరూ బాల్యం నుంచీ నాటకాలు ఆడేవారు. ఆ రోజుల్లో హార్మోనియం మీద మంచి పట్టు సాధించారు చక్రవర్తి. తన మిత్రులతో కలసి నాటకాలు వేసే రోజుల్లో కింద కూర్చుని నాటకానికి తగ్గట్టుగా హార్మోనియంపై వేళ్ళు కదిలించేవారు. ఆయన సైతం పలు నాటకాల్లో నటించారు. అసలు నటుడు కావాలనే చక్రవర్తి చెన్నపట్టణం చేరారు. అయితే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటీ అన్నట్టు చక్రవర్తికి నటునిగా అవకాశాలేవీ లభించలేదు. దాంతో కొన్ని అనువాద చిత్రాలకు గాత్రదానం చేశారు. కొన్ని డబ్బింగ్ చిత్రాలకు రీ-రికార్డింగ్ లో పనిచేశారు. పలువురు సంగీత దర్శకుల వద్ద హార్మోనియం కూడా వాయించారు. మిత్రుల సలహా మేరకు సంగీత దర్శకునిగా మారారు. ‘చక్రవర్తి’ అని ఆయనకు నామకరణం చేసిందీ మిత్రులే. ‘మూగప్రేమ’ (1970) చిత్రంతో తొలిసారి చక్రవర్తి పేరుతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యారు.
‘గోల’ చేయించిన సంగీతం!
చక్రవర్తికి మంచి గుర్తింపు సంపాదించి పెట్టిన చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘శారద’ (1973). ఈ చిత్రంలోని పాటలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. తరువాత ప్రముఖ దర్శకనిర్మాత కె.ఎస్.ప్రకాశరావు (కె.రాఘవేంద్రరావు తండ్రి) చక్రవర్తిని ప్రోత్సహించారు. తాను తీసిన ‘ఇదాలోకం’ చిత్రానికి చక్రవర్తితోనే స్వరకల్పన చేయించారు. ఇందులోని పాటలూ భలేగా అలరించాయి. ఆ తరువాత పలు చిత్రాలకు స్వరాలు సమకూర్చినా అంతగా పేరు రాలేదు. కె.రాఘవేంద్రరావు తొలి చిత్రం ‘బాబు’ (1975)కు కూడా చక్రవర్తి బాణీలు కట్టారు. అందులోని పాటలు మాస్ ను అలరించాయి. అదే సమయంలో కె.ఎస్.ప్రకాశరావు తెరకెక్కించిన ‘చీకటివెలుగులు’ లోనూ చక్రవర్తి స్వరాలు మంచి ఆదరణ పొందాయి. ఇక యన్టీఆర్ ‘అన్నదమ్ముల అనుబంధం’ (1975) చిత్రం ‘యాదోంకీ బారాత్’ హిందీ సినిమాకు రీమేక్. అందులో మాతృకను అనుసరిస్తూనే, తనదైన బాణీ పలికించారు చక్రవర్తి. ఆ పాటలు విశేషాదరణ చూరగొన్నాయి. దర్శకులు దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు చక్రవర్తిని బాగా ప్రోత్సహించారు. ఇక యన్టీఆర్ కూడా తన చిత్రాలకు చక్రవర్తి పేరును సిఫార్సు చేసేవారు. యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘యమగోల’ (1977) అనూహ్య విజయం సాధించింది. ఆ సినిమాకు చక్రవర్తి సమకూర్చిన బాణీలు జనాన్ని కుర్చీలలో కుదురుగా కూర్చోనివ్వకుండా చేశాయి. దాంతో చక్రవర్తి సంగీతానికి క్రేజ్ పెరిగింది.
నిజంగా చక్రవర్తే!
చక్రవర్తికి ఏ ముహూర్తాన ఆయన మిత్రులు ఆ పేరు పెట్టారో కానీ, నిజంగానే తెలుగు సినిమా సంగీతాన్ని ఆయన శాసించారు. యన్టీఆర్ సినిమాలతో చక్రవర్తికి మంచి గుర్తింపు లభించింది. ఆ నాటి టాప్ హీరోస్ చిత్రాలకే కాదు, వర్ధమాన కథానాయకుల సినిమాలకు, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు కూడా చక్రవర్తి సంగీతం ప్రాణం పోసింది. ప్రతి యేడాది 60 నుండి 75 శాతం తెలుగు చిత్రాలకు చక్రవర్తి సంగీతమే పెద్ద ఎస్సెట్ గా నిలిచింది. ఆయన స్వరకల్పన చేసిన వందలాది చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఆ రోజుల్లో రికార్డుల అమ్మకాల్లోనూ చక్రవర్తి సినిమాలు పలు రికార్డులు క్రియేట్ చేశాయి. నాలుగు తరాల స్టార్ హీరోస్ చిత్రాలను చక్రవర్తి బాణీలు మ్యూజికల్ హిట్స్ గా నిలిపాయి. ఆయన తరువాత తెలుగునాట ఆ స్థాయిలో అలరించిన సంగీత దర్శకుడు మరొకరు కానరారు. తనకు సంగీతపరిజ్ఞానం లేదంటూనే తెలుగు సినిమా సంగీతాన్ని శాసించారు చక్రవర్తి. ఆయన వద్ద అసోసియేట్స్ గా పనిచేసిన వారెందరో తరువాతి కాలంలో అగ్రసంగీత దర్శకులుగా పేరు సంపాదించారు.
చెరగని ముద్ర వేసిన చక్రవర్తి!
నటుడు కావాలని మదరాసు చేరిన చక్రవర్తి తాను ఎంత బిజీగా ఉన్నా అడపా దడపా తెరపై కనిపించేవారు. యన్టీఆర్ ‘గజదొంగ’లో కాసేపు పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపించి అలరించారు. ఆ తరువాత ‘పక్కింటి అమ్మాయి’లో కామెడీతో కడుపుబ్బ నవ్వించారు. చక్రవర్తి సంగీతానికి క్రేజ్ తగ్గి, కొత్త తరం మ్యూజిక్ డైరెక్టర్స్ వస్తున్న రోజుల్లోనే ఆయన నటనలోకి దిగారు. ఆయన స్వరకల్పనలో రూపొందిన చివరి చిత్రం ‘అమ్మోరు’. ఆ తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు చక్రవర్తి. చివరి సారిగా ‘నిన్నే ప్రేమిస్తా’ చిత్రంలో చక్రవర్తి తెరపై కనిపించారు. తొలి రోజుల్లో అనువాద కళాకారునిగా, గాయకునిగా, తరువాత నటునిగా సాగిన చక్రవర్తి సంగీత దర్శకునిగానే సుప్రసిద్ధులు. ఆయన పేరు వినగానే ఈ నాటికీ నాటి అభిమానులకు చక్రవర్తి స్వరకల్పనలో రూపొందిన పాటలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఆ నాటి టాప్ హీరోస్ అందరి అభిమానులు చక్రవర్తి సంగీతాన్ని అభిమానించారు. చక్రవర్తి సంగీతం ఉంటే చాలు తమ హీరో సినిమాలు భలేగా ఆడతాయనే నమ్మకంతో ఉండేవారు ఫ్యాన్స్. వారి అంచనాలను ఏ నాడూ వమ్ము చేయకుండానే చక్రవర్తి అందరు హీరోల సినిమాలకు వినసొంపైన సంగీతం సమకూర్చారు. అందుకే ఈ నాటికీ చక్రవర్తి సినీఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకొనే ఉన్నారు.
తాజావార్తలు
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..