Remake demand for Ari Movie: తెలుగు దర్శకులు మన పురాణాలు, ఇతిహాసాల కథలు వాడుకొని నేటి తరానికి నచ్చేలా సినిమాలు తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. సినిమా కథల్ని కొత్త పుంతలు తొక్కిస్తున్న మన డైరెక్టర్లు ఇప్పటికే పలు సినిమాలతో హిట్లు కొడుతున్నారు. ఇక అలాంటి సినిమాలకి టాలీవుడ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా మరో తెలుగు సినిమా పెద్ద సౌండ్ చేయడానికి రెడీ అవుతోంది. అదే ‘అరి’. పేపర్ బాయ్’ సినిమా ఫేమ్ జయశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించగా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏప్రిల్ లాస్ట్ వీక్‌లో ఈ సినిమా విడుదయ్యే అవకాశం ఉండగా విడుదల కూడా కాకముందే రీమేక్‌పై పలువురు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్. యంగ్ హీరో శివకార్తికేయన్ అలయాన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కి వచ్చిన సమయంలో ‘అరి’ట్రైలర్ చూశారట. ఇక ఆ ట్రైలర్ విపరీతంగా నచ్చి సినిమా మొత్తం చూశాడట శివకార్తికేయన్.
Kumari Aunty: కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ మూత.. మాకేం సంబంధం లేదంటున్న యంగ్ హీరోయిన్
అందులోని కృష్ణుడు పాత్ర బాగా ఆకట్టుకోగా ఈ సినిమాను తమిళ్‌లో రీమేక్ చేస్తే.. కృష్ణుడు పాత్రలో తాను నటిస్తానని జయశంకర్‌కి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక అరి తెలుగులో రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటే తమిళ్‌లో రీమేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే సమయంలో నార్త్‌లో కూడా కృష్ణతత్వం కాన్సెప్ట్‌తో వచ్చే సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన కార్తికేయ 2 సౌత్‌లో కంటే నార్త్‌లో బాగా ఆడడంతో ‘అరి’ కూడా అలాంటి సినిమా కావడంతో.. హిందీలో కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి కుడా ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ రీమేక్‌లో నటించడానికి అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే త్వరలోనే అభిషేక్‌ని కృష్ణుడిగా చూడొచ్చని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రీలీజ్‌కు రేడీగా ఉండడంతో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో పాటు చినజీయర్ స్వామిలకు చూపగా వారు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారని తెలుస్తోంది.