Hrithik Roshan : బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన పర్మిషన్ లేకుండా కొన్ని బిజినెస్ వెబ్ సైట్లు, ఈ కామర్స్ వెబ్ సైట్లలో తన ఫొటోలు, వీడియోలు వాడుతున్నారంటూ ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పిటిషన్ మీద తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. హృతిక్ రోషన్ కు సంబంధం లేకుండా వాడుతున్న ఫొటోలు, వీడియోలను వెంటనే డిలీట్ చేయాలంటూ ఆర్డర్ వేసింది. ఈ కామర్స్ వెబ్ సైట్లలోనూ వాటిని తొలగించాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. అయితే ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో హృతిక్ ఫొటోలు, వీడియోలు వాడుతున్నారని.. వాటిని కూడా కంట్రోల్ చేయాలంటూ హృతిక్ తరఫు న్యాయవాది కోరారు.
Read Also : Sai Durga Tej : ‘బ్రో’ తర్వాత రెండు మూవీలు ఆగిపోయాయి.. సాయితేజ్ ఎమోషనల్
ఈ విషయంలో హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమానులు వాడేవి వ్యాపార లాభం కోసం కాదని.. అది అభిమానం రూపంలో మాత్రమే అంటూ తెలిపింది. పైగా వాటిని వాడటం వల్ల ఇతరులకు నేర్పించాలనే ఉద్దేశమే ఉందే తప్ప.. అందులో ఎలాంటి లాభపేక్ష లేదు అని హైకోర్టు తెలిపింది. ఈ నడుమ చాలా మంది బాలీవుడ్ స్టార్లు ఈ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. మొన్నటికి మొన్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, దీపిక పదుకొణె లాంటి వారు ఇలాంటి పిటిషన్లే వేశారు. రీసెంట్ గా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన వార్-2 పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నార్త్ లో పర్వాలేదు అనే కలెక్షన్లు తెచ్చుకుంది. ప్రస్తుతం హృతిక్ రెండు సినిమాల్లో బిజీగా ఉన్నారు.
Read Also : Priyadarshi : నన్నెందుకు టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో అర్ధం కాలేదు!
