Site icon NTV Telugu

Prabhas: ప్రభాస్ కి ఇష్టమైన రొయ్యల పలావ్ రెసిపీ ఇదే.. ఇక చరణ్ వంతు!

Prabhas Ram Charan Recipe Challenge

Prabhas Ram Charan Recipe Challenge

Rebel star Prabhas kickstarts MSMP recipe challenge:‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి‘ ప్రమోషన్స్ లో ఇప్పటి వరకు సైలెంటుగా ఉన్న హీరోయిన్ అనుష్క శెట్టి ఇప్పుడు మాత్రం ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ముందుకొచ్చింది. ఈ సినిమాలో చెఫ్ అన్విత ర‌వళి శెట్టి క్యారెక్టర్ లో నటించిన అనుష్క సినిమాను ప్రమోట్ చేసేందుకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తనకు ఇష్టమైన వంటలైన మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు స్పెషల్ నీర్ దోస రెసిపీలను ఎలా తయారు చేయాలో తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను మొదటగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు విసిరింది. ప్రభాస్ ఎంత ఫుడ్ లవర్ అనేది అందరికీ తెలుసు, ఆయన ఇష్టంగా తినడమే కాదు..తన కో స్టార్స్ కు, స్నేహితులకు మంచి మంచి వంటలు రుచి చూపిస్తుంటారు, అందుకే ఫస్ట్ ప్రభాస్ కు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ విసిరినట్లు అనుష్క తెలిపింది.

Pa. Ranjith: సనాతన ధర్మంపై ఉదయనిధి మాటల్లో తప్పేం లేదు.. పా.రంజిత్ సంచలన ట్వీట్

ఇక అనుష్క విసిరిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకున్న ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా తనకు ఎంతో ఇష్టమైన రొయ్యల పలావ్ లా తయారు చేయాలో వివరించారు. ఎంతోకాలంగా అనుష్క తో తనకు పరిచయం ఉన్నా, ఆమె ఫేవరేట్ డిష్ తనకు తెలియదని, ఇప్పుడు తెలిసింది అని ప్రభాస్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ ను రామ్ చరణ్ కు ఫార్వర్డ్ చేశాడు ప్రభాస్. ప్రభాస్, అనుష్క బిల్లా, మిర్చి, బాహుబలి1, బాహుబలి 2 చిత్రాల్లో కలిసి నటించి ఆడియెన్స్ ఫేవరేట్ జోడీ కావడమే కాకుండా మంచి స్నేహితులు కూడా అయ్యారు. ఇక ఈ స్నేహంతో అలాగే తన సొంత వారు అయిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మితం కావడంతో అనుష్క హీరోయిన్ గా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్. ఇక ప్రభాస్ తో పాటు ప్రేక్షకులను కూడా అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ ఛాలెంజ్ తీసుకోవాలని కోరింది. వాళ్లు తమకు నచ్చిన రెసిపీని, వాటిని తయారుచేసే పద్ధతిని పోస్ట్ చేయాలని ఆమె కోరింది.

Exit mobile version