Site icon NTV Telugu

Krishnam Raju Final Rites: అశ్రునయనాల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు పూర్తి

Rebel star rites

506b3356 E9d4 4a03 B7e8 947557d06bc0

Rebel Star Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు  (Krishnam Raju:) అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడవడంతో ఆయన అభిమానులతో పాటు చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం కృష్ణంరాజు కన్నుమూశారు. సోమవారం మధ్యాహ్నం వందల మంది అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం కనకమామిడిలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతకుముందు ఫాహౌజ్‌కు తరలించేముందు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె రోదించారు. తన భర్త పార్థివదేహాన్ని స్వయంగా తన భుజాలపై మోసి వాహనం వరకు తీసుకెళ్లిన దృశ్యాలు కంటతడి పెట్టించాయి. కూతుళ్ళు ముగ్గురూ తల్లి పార్ధివ దేహాన్ని చూసి తట్టుకోలేకపోయారు.

జూబ్లిహిల్స్ నుంచి ప్రారంభమయిన కృష్ణంరాజు అంతిమయాత్ర పటిష్ఠ బందోబస్తుతో అప్పా జంక్షన్‌ మీదుగా మొయినాబాద్‌లోని కనకమాడిలోని ఫామ్‌హౌజ్‌లో వరకు సాగింది. తమ అభిమాన నటుడిని చివరిసారి చూసుకునేందుకు ఈ అంతిమయాత్రలో వేలాదిమంది అభిమానులు పాల్గొన్నారు. ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసింది. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. కృష్ఱంరాజు పార్థివదేహానికి గన్‌ సెల్యూట్‌ చేశారు. అంత్యక్రియలకు అనుమతి ఉన్నవారిని మాత్రమే ఫాంహౌస్‌ లోపలికి పోలీసులు అనుమతించారు. భద్రతా ఏర్పాట్లను శంషాబాద్‌ డీసీపీ పర్యవేక్షించారు.

అంత్యక్రియలకు కృష్ణంరాజు బంధువులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. కన్నీటి పర్యంతం అవుతూ ఆయన అంత్యక్రియల్లో పాల్గోని ప్రభాస్ ని ఓదార్చారు. నటుడిగానే కాదు కేంద్రమంత్రిగాను ఆయన పనిచేశారు. బీజేపీనుంచి పోటీచేసిన ఆయన్ని ఎంపీగా గెలిపించారు గోదావరి జిల్లా ఓటర్లు. రెబల్ స్టార్ గానే కాదు మనవత్వం, మంచితనం వున్న మనిషిగా కృష్ణంరాజు ఎంతో పేరు గడించారని సినీ ప్రముఖులు అంటున్నారు. ఆయన మరణానికి సినీ రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు నివాళులు అర్పించారు. కృష్ఱంరాజు రారాజుగానే బతికారు..సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా పెద్దమనిషి తరహాలో పరిష్కారానికి తనవంతు కృషిచేశారు. ఆయన లేని లోటు తీర్చలేనిది.

Exit mobile version