టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. పాత సినిమా ఏదైనా సరే రీ రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేయడమే ఆలస్యం బుకింగ్స్ సైతం గంటల్లో హౌజ్ ఫుల్ బోర్డ్స్ పడిపోతున్నాయి. మురారి, సింహాద్రి, ఆరెంజ్, చెన్నకేశవ రెడ్డి, ఖుషి ఈ సినిమాలు రీరిలీజ్ లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇక లేటెస్ట్‌గా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ అవగా థియేటర్లు మాస్ జాతరను తలపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే అప్పట్లో ఫ్లాప్ అయి రీరిలీజ్ లో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి కొన్నిసినిమాలు ఉదాహరణకు ఆరెంజ్, సూర్య సన్నాఫ్ కృష్ణన్.
Also Read : AAA : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరో హీరో ఫిక్స్.?
మరి కొత్త సినిమాల రేంజ్‌లో రీ రిలీజ్ సినిమాలకు ఎందుకింత క్రేజ్ అంటే అది సినిమా దాహమే. దానికి కారణం మన హీరోలే. మరోసారి తమ హీరో సినిమాను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకునే వారు చాలామంది ఉన్నప్పటికీ కొత్త సినిమాలు రాకపోవడమే రీ రిలీజ్ క్రేజ్‌కు మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. కనీసం ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయకుండా ఒక్కో సినిమాను ఏండ్లకేండ్లు షూటింగ్ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. లాస్ట్ ఇయర్ గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబుని మళ్లీ ఎప్పుడు థియేటర్లో చూస్తమనేది చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాజమౌళి ఎస్ఎస్ఎంబీ 29 కోసం ఎన్నేళ్ల సమయం తీసుకుంటాడో తెలియదు. మరోవైపు హరిహర వీరమల్లు నాలుగైదేళ్లుగా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎన్టీఆర్, చరణ్, మెగాస్టార్ రెబల్ స్టార్ నెక్ట్స్ సినిమాలు రిలీజ్ ఎప్పుడంటే చెప్పలేని పరిస్థితి. అందుకే తమ అభిమాన హీరోల సినిమాలు రీ రిలీజ్ అంటే చాలు థియేటర్లకు ఎగబడిపోతున్నారు. ఫ్లాప్ బొమ్మను కూడా హిట్ చేసేస్తున్నారు. మేకర్స్ కూడా దీన్ని క్యాష్ చేసుకుంటున్నారు.