బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వెడ్డింగ్ ఇంపాక్ట్ రామ్ చరణ్ సినిమాపైన పడింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇందులో యంగ్ లుక్ లో చరణ్ కనిపించే పాత్రకి హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.
Read Also: Allu Aravind: కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?
ఈ సెమీ పీరియాడిక్ డ్రామాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగా షెడ్యూల్ ని చేంజ్ చేస్తూ సాంగ్ షూటింగ్ ని ఫిబ్రవరి 9కి వాయిదా వేసినట్లు సమాచారం. కియారా అద్వానీ జాయిన్ ‘RC 15’ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ప్రతి నెలలో 12 రోజులు మాత్రమే RC 15 షూటింగ్ జరుగుతోంది, మిగిలిన రోజుల్లో శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. శంకర్ ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ ని జరుపుతున్నాడు కాబట్టే RC 15 డిలే అవుతుందని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.