Rayavalasa : కొడుకు హీరో తల్లి డైరెక్టర్ తండ్రి నిర్మాత.. ఆకట్టుకునేలా రాయవలస టీజర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల తెలుగులో వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది, ఇదే కోవలో రాబోతున్న తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ “రాయవలస”. ఒకే కుటుంబానికి చెందిన వారు ఈ సినిమాలోని ప్రధాన బాధ్యతలు తీసుకోవడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత. కార్తీక్ జయంతి హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని అతని తండ్రి గోపీకృష్ణ జె. నిర్మించగా, తల్లి రాధిక జయంతి దర్శకత్వం వహించడం విశేషం. రేసన్ (RaysuN) ప్రొడక్షన్స్ పతాకంపై “లవ్ టైడ్ బై ఫేట్” (Love Tied by Fate) అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌కు ఇప్పటికే అద్భుతమైన స్పందన రాగా, తాజాగా చిత్ర బృందం టీజర్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ వేడుకకు యువ హీరో ఆకాష్ జగన్నాథ్, ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తనకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ప్రాణమని, తన కలను నిజం చేసిన తల్లిదండ్రులకు హీరో కార్తీక్ జయంతి కృతజ్ఞతలు తెలిపారు. “రాయవలస రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఒక రాజు-రాణి కథ. సినిమాలోని ఇంటర్వెల్, క్లైమాక్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. కంటెంట్ కచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది, మమ్మల్ని ఆదరించండి” అని కార్తీక్ ధీమా వ్యక్తం చేశారు. దర్శకురాలు రాధిక జయంతి మాట్లాడుతూ.. “నా కొడుకును నేనే హీరోగా లాంచ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. రచయిత రాఖీ చెప్పిన కథ బాగా నచ్చడంతో నా భర్త గోపీకృష్ణ నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టాం. ఆయన ఇచ్చిన సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషితో విజువల్స్, మ్యూజిక్ అద్భుతంగా వచ్చాయి. మా ఫస్ట్ లుక్ లాంచ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించిన డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి ప్రత్యేక కృతజ్ఞతలు” అని తెలిపారు.
Also Read
- Pradeep Ranganathan: ఆ డైరెక్టర్'తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
- Rao Bahadur: "మీ కాలర్ పట్టుకుని లాగుతుంది.. బాడీలోకి పూనకాలు తెప్పిస్తుంది!" రావు బహదూర్’ మహేష్ బాబు రివ్యూ!
- Bunny Vas : తెలుగుమ్మాయని అవకాశం ఇస్తే.. మాకు 15 రూల్స్ పెట్టింది.
- Mirzapur The Movie : మిర్జాపూర్ : ది మూవీ’ టీజర్ విడుదల
తాజావార్తలు
-
Khairatabad Ganesh : ఈ ఏడాది 70 అడుగుల ‘పంచముఖ సంకట హార మహా గణపతి’.!
-
T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
-
Homemade Paneer : ఇంట్లోనే సాఫ్ట్ పనీర్.. ఈ ట్రిక్ తెలిస్తే చాలు!
-
Early Pregnancy Diet: గర్భంతో ఉన్న వారు బొప్పాయి, పైనాపిల్ తినకూడదు ఎందుకు..? కారణం ఇదే..
-
Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!