Ravanasura: ఈరోజు సాయంత్రం ‘రావణుడు’ వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలు ఇచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ముందెన్నడూ లేనంత జోష్ లో, ఇప్పటివరకూ చెయ్యనంత యాక్టివ్ గా ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఫాన్స్ లో జోష్ నింపుతున్నాడు రవితేజ. డిసెంబర్ లో ధమాకా అయిపొయింది, జనవరి వాల్తేరు వీరయ్య వచ్చేసింది ఇక ఇప్పుడు ఏప్రిల్ లో ‘రావణాసుర’ టైం వచ్చింది. సుదీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి రానున్న రావణాసుర మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. రావణాసుర టీజర్ కి సూపర్బ్ రెస్పాన్స్ రావడం, రావణాసుర థీమ్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో రావణాసుర సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ అంచనాలని పెంచూతు మేకర్స్ రోజుకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూనే ఉన్నారు. హాలీవుడ్ యాక్షన్ మూవీ జాన్ విక్ ని గుర్తు చేసే రేంజులో రవితేజ సూటు బూటు వేసుకోని గన్ పట్టుకోని కనిపిస్తున్నాడు.
ఈ పోస్టర్స్ లో రవితేజ కనిపించినంత స్టైలిష్ గా ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో కనిపించలేదు. అందుకే యాక్షన్ సినిమాగా ప్రమోట్ అవుతున్న రావణాసురపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఎక్స్పెక్టేషన్స్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లడానికి మేకర్స్ రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4:05 నిమిషాలకి రావణాసుర ట్రైలర్ ని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఈ ట్రైలర్ బయటకి రావడం రావణాసుర సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకడం రెండూ ఒకటే సారి జరుగుతాయి. భీమ్స్ సిసిరోలియో, హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాతో రవితేజ హ్యాట్రిక్ కొడతాడేమో చూడాలి. దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా, అను ఇమ్మానుయేల్, పూజితా పోన్నాడా కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ మూవీలో అక్కినేని సుశాంత్ కూడా నటిస్తున్నాడు.
Also Read
Dropping the riveting & powerful #RavanasuraTrailer today at 4:05 PM! 🔥 🔥
Mass Maharaja @RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @AbhishekPicture#RavanasuraOnApril7 #RavanasuraOnApril7 pic.twitter.com/3XCXQv2Xa6
— ABHISHEK PICTURES (@AbhishekPicture) March 28, 2023
తాజావార్తలు
-
Vijayawada Drugs: బెజవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం.. ఎంబీఏ విద్యార్థిని అరెస్ట్!
-
Gold Keep In House: ఇంట్లో బంగారం, వెండి ఎంత ఉండాలో తెలుసా.. ఇవిగో రూల్స్..
-
Anand Mahindra: 1947 విల్లీస్ జీప్ నుంచి థార్.ఈ వరకు.. ఒక్క వీడియోలో మహీంద్రా 77 ఏళ్ల ప్రయాణం..
-
Andhra Style Amla Pachadi Recipe: ఆంధ్రా స్టైల్ ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి ఇలా చేస్తే అన్నంలోకి అదిరిపోతుంది!
-
Emraan Hashmi Accident: ఇమ్రాన్ హష్మీకి త్రుటిలో తప్పిన ప్రమాదం.. పల్టీ కొట్టిన కారు..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..