Raviteja Eagle movie Walks out from Sankranthi Race: తెలుగు సినీ పరిశ్రమ మొత్తానికి సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన సీజన్. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని దర్శక నిర్మాతలు భావిస్తూ ఉంటారు. అందుకే అదే డేట్ కి రావాలని దాదాపుగా అందరి దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే 2024 సంక్రాంతికి ఈసారి ఐదు సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్, నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ, మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈగల్, తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఒకేసారి ఐదు సినిమాలు రిలీజ్ చేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. రిలీజ్ చేశామంటే చేశామన్నట్టు వదిలేయచ్చు, కానీ ఏ ఒక్క సినిమాకి పూర్తిస్థాయిలో థియేటర్లు దొరకవు. దాదాపుగా ఈ సినిమాలు ఒకటి రెండు రోజుల వ్యవధిలో రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి థియేటర్ల అంశం చాలా కీలకం. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయి రెండు మూడు వందల రోజులు ఆడేవి.
Eagle: బ్రేకింగ్.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈగల్..
కానీ ఇప్పుడు వారం పది రోజుల్లో ఎంత కలెక్ట్ చేసి బయటపడింది అనేది మెయిన్ పాయింట్ అయిపోయింది. ఇలా ఐదు సినిమాలు బరిలో దిగుతున్న సంగతి తెలుగు ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వంటి వాటి దృష్టికి రావడంతో ఈ విషయంలో వెనక్కి తగ్గమని అన్ని సినిమాల దర్శక నిర్మాతలను మీటింగ్ కి పిలిచి మరీ కోరారు. గతంలోనే దీనికి సంబంధించిన చర్చలు పూర్తికాగా ఐదు సినిమాల దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గేందుకు ఆసక్తి చూపించలేదు. అయితే సినిమా రిలీజ్ లకు ఇంకా వారం రోజులే వ్యవధి ఉండడం, ఇంకా పూర్తిస్థాయిలో థియేటర్లను బ్లాక్ చేసుకునే పరిస్థితి లేకపోవడంతో మరోసారి సినీ పెద్దలు ఈ విషయం మీద దృష్టి పెట్టి సాధ్యాసాధ్యాలు గురించి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ మేలు కోసం ఎవరో ఒకరు వెనక్కి వెళితే బాగుంటుందని అలా వెళితే సోలో రిలీజ్ డేట్ ఇప్పిస్తామని కూడా పేర్కొన్నారు. అయితే ఇప్పటికే సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న రవితేజ ఈగల్ యూనిట్ సినీ పరిశ్రమ మేలు కోసం వెనక్కి తగ్గేందుకు నిర్ణయించింది.
రవితేజ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. కానీ సినీ పరిశ్రమ మేలుకోరే రవితేజ నిర్మాతలతో సంప్రదించి సినిమాని సోలో రిలీజ్ చేద్దామని మాట్లాడి ఫిబ్రవరి 9న రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ఒక పక్క అభిమానుల ఒత్తిడి ఉంటుందని తెలిసి కూడా తనను ఇంతవాడిని చేసిన ఇండస్ట్రీ మేలు కోసం రవితేజ తీసుకున్న నిర్ణయం విని టాలీవుడ్ జనం అంతా హాట్సాఫ్ రవితేజ అంటున్నారు. అభిమానులు ఈ విషయాన్ని కాలర్ ఎగరవేసుకుని, మా హీరో పరిశ్రమ కోసం సినిమా వాయిదా వేసుకున్నాడు అని చెప్పచ్చు అని దిల్ రాజు లాంటి నిర్మాత అన్నారంటే అది మామూలు విషయం కాదు సుమా. ఓ సినిమా మూడు వారాలు వెనక్కు వెళ్లడం అంటే.. చాలా పెద్ద త్యాగం…ఆర్థికంగా చాలా భారం పడుతుంది అయినా పరిశ్రమ మేలే పరమావధిగా ఈ నిర్ణయం తీసుకుంది ఈగల్ టీం. నిజానికి ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరో ఎవరంటే మాస్ మహారాజా రవితేజ అనే చెప్పాలి. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి మాస్ మహారాజా స్థాయికి వచ్చారు కాబట్టి ఆయనకు సినీ పరిశ్రమలోని సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలు, లోటుపాట్లు అన్నీ తెలుసు. అలా ఇప్పుడు టాలీవుడ్ మంచి కోసం ఆయన తీసుకున్న నిర్ణయంతో తన అభిమానుల గుండెల్లో మరో మెట్టు ఎక్కేశాడు రవితేజ. మా సినిమా ఎలా అయినా సంక్రాంతికి వచ్చేయాలి, కలెక్షన్స్ కొట్టేయాలి అని సేఫ్ గేమ్ ఆడుతూ కూర్చోకుండా రవితేజ తీసుకున్న నిర్ణయం గురించి నెటిజన్లు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.