2024 సంక్రాంతి సినిమాల లిస్టు నుంచి పక్కకి వెళ్లి… మిగిలిన వాళ్లకి కాస్త రిలీఫ్ ఇచ్చాడు మాస్ మహారాజా రవితేజ. జనవరి 13 నుంచి ఈగల్ సినిమా వాయిదా పడడంతో… ప్రొడ్యూసర్స్ ఈగల్ మూవీకి సోలో రిలీజ్ ఇస్తామనే మాట కూడా అన్నారు. జనవరి నుంచి ఫిబ్రవరి 9కి ఈగల్ సినిమా వాయిదా పడింది. ఈ రిలీజ్ డేట్ కే రావాల్సిన డీజీ టిల్లు 2 మూవీ వెనక్కి వెళ్లి, ఆ డేట్ ని ఈగల్ కి ఇచ్చింది. టిల్లు వెనక్కి వెళ్లినా కూడా ఈగల్ మూవీకి సోలో రిలీజ్ దొరికే అవకాశం కనిపించట్లేదు. ఇదే డేట్ కి ఒకటి మూడు సినిమాలు రిలీజ్ రేస్ లోకి వచ్చాయి. ఈగల్ మూవీకి పోటీగా యాత్ర 2, ఊరిపేరు భైరవకోన సినిమాలు రిలీజ్ రేస్ లోకి వచ్చాయి. ఇది చాలవన్నట్లు డబ్బింగ్ సినిమా కూడా విడుదలకి సిద్ధమవుతుంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ స్పెషల్ క్యామియో ప్లే చేసిన లాల్ సలామ్ సినిమా ఫిబ్రవరి 9నే రిలీజ్ అవనుంది. ఇందులో యాత్ర 2, ఊరిపేరు భైరవకోన సినిమాలపైన కూడా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఈగల్ మూవీ టఫ్ ఫైట్ ఫేస్ చేయాల్సిందే. ఇంతమాత్రం దానికి ఈగల్ మూవీకి సోలో రిలీజ్ లాంటి మాటలు ఎందుకు చెప్తున్నారు అంటూ రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నాలుగు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో రిలీజ్ అవ్వడం అనేది ఏ సినిమాకైనా రిస్క్ ఫ్యాక్టరే. సో ఫిబ్రవరి 9న కూడా థియేటర్స్ ఇష్యూ టాపిక్ వస్తుంది అప్పుడు కూడా ఎవరో ఒకరు వెనక్కి తగ్గాల్సి వస్తుంది. మరి ఒకరు ఎవరు అవుతారు? ఎవరు వెనక్కి వెళ్లి రవితేజకి లైన్ క్లియర్ చేస్తారు అనేది చూడాలి.