మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఖిలాడీ’. ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో రవితేజ ఇద్దరు అందాల భామలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతితో రొమాన్స్ చేశాడు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహించగా, డిఎస్పీ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించారు. “ఖిలాడి” ఫిబ్రవరి 11న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం సరిగ్గా ఒక నెల తర్వాత ఈ మూవీ ఓటిటీ ప్రీమియర్‌లకు సిద్ధంగా ఉంది.
Read Also : Shane Warne Demise : క్రికెట్ లెజెండ్ కు సెలెబ్రిటీల నివాళి
మార్చి 11వ తేదీ నుండి ఖిలాడీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులోకి వస్తుంది. “ఈ ఆటలో ఒక్కడే కింగ్… మరికొద్ది రోజులే వెయిటింగ్… ఫుల్ కిక్ తో మార్చ్ 11న డిస్నీ హాట్ స్టార్ లో మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడీ’ రాబోతున్నాడు” అంటూ హాట్ స్టార్ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి బిగ్ స్క్రీన్ పై ప్రేక్షకులను నిరాశకు గురి చేసిన ‘ఖిలాడీ’కి ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Ee aata lo okkade king! Inka koddi rojule waiting!! Full kick toh March 11th na @DisneyPlusHS lo MassMaharaja @RaviTeja_offl's Khiladi is coming!! Catch him if you can #KhiladiOnHotstar #Raviteja #disneyplushotstar #MassMaharaja pic.twitter.com/FabOPHrHj3
— JioHotstar Telugu (@JioHotstarTel_) March 4, 2022