Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే రవితేజ,. ఒకవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘ఇరుముడి’ చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుండగా, ఇప్పుడు ఏకంగా ఇద్దరు యంగ్ అండ్ ప్రామిసింగ్ డైరెక్టర్లను ఒకేసారి పట్టేయడం ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రెండు సినిమాలూ విభిన్నమైన జోనర్లలో ఉండబోతున్నట్లు సమాచారం.
దర్శకుడు వివేక్ ఆత్రేయ నిజానికి నందమూరి బాలకృష్ణ కోసం ఒక పవర్‌ఫుల్ మాస్ కథను సిద్ధం చేసి, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ కూడా పొందారు. అయితే, బాలయ్య ప్రస్తుతం తన రాజకీయ, ఇతర సినిమా కమిట్‌మెంట్లతో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ ఆలస్యమయ్యేలా ఉంది. ఈ గ్యాప్‌ను వృథా చేయకూడదని భావించిన వివేక్, ఆ కథను రవితేజకు వినిపించగా.. ఆయనకు కూడా బాగా నచ్చి వెంటనే షూటింగ్‌కు ఓకే చెప్పేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
మరోవైపు, ‘రాజ రాజ చోర’ వంటి వైవిధ్యమైన చిత్రంతో మెప్పించిన హసిత్ గోలి దర్శకత్వంలో రవితేజ మరో సినిమా చేయబోతున్నారు. దిల్ రాజు సారథ్యంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. విశేషం ఏమిటంటే, వివేక్ ఆత్రేయ, హసిత్ గోలి సినిమాల షూటింగ్స్‌ను రవితేజ సమాంతరంగా (ఒకే సమయంలో) జరపాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు టైటిల్స్ వెలువడనున్నాయి. మొత్తానికి ‘ఇరుముడి’తో పాటు ఈ రెండు సినిమాలు కూడా రవితేజ మాస్ ఇమేజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!