Site icon NTV Telugu

Ravi Teja: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్

Ravi Teja

Ravi Teja

Ravi Teja: తనకు మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో ఇష్టమని వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా మరోసారి హీరో రవితేజ స్పష్టం చేశాడు. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు ఆల్ ది బెస్ట్ కాకుండా రవితేజ కంగ్రాట్స్ చెప్పాడు. ఎందుకంటే ఈ సినిమాకు సూపర్ హిట్ అనే పదం చాలా చిన్నది అని.. ఈ మూవీ బ్లాక్ బస్టర్ కావడం ఖాయమని.. మరోసారి సక్సెస్ మీట్‌లో కలుద్దామని మాస్ మహారాజా సెలవిచ్చాడు. బాబీ జర్నీ గుంటూరు నుంచి ప్రారంభం అయితే.. తన జర్నీ మెగాస్టార్‌తో విజయవాడ నుంచి మొదలైందని తెలిపాడు. విజయవాడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో విజేత సినిమా ఫంక్షన్‌కు వెళ్లానని.. అప్పట్లో చిరంజీవి గారిని కలవలేకపోయానని.. కానీ ఏదో ఒకరోజు అన్నయ్య పక్కన కూర్చుంటానని కాన్ఫిడెంట్‌గా చెప్పానని రవితేజ అన్నాడు. అలా కొన్నేళ్ల తర్వాత అన్నయ్యకు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో, ఆ తర్వాత తమ్ముడి క్యారెక్టర్‌లో నటించానని రవితేజ వివరించాడు. ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మరోసారి అన్నయ్యతో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించినట్లు చెప్పాడు.

Read Also: Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు.. బెండు తీయడానికి పవన్ వచ్చాడు

అన్నయ్య చిరంజీవి మనస్సు ఎంతో మంచిది అని.. ఏనాడూ ఒక మనిషి గురించి నెగిటివ్‌గా మాట్లాడటం తాను చూడలేదని రవితేజ అన్నాడు. ఎవరైనా ఏదైనా అంటే అన్నయ్య ఓపికగా భరిస్తారని.. బాధపడతారేమో కానీ బయట మాత్రం పడరని తెలిపాడు. ఆయనలో ఉన్న గొప్ప లక్షణమే అది అని రవితేజ చెప్పాడు. అందుకే ఆయన అంటే తనకు చాలా ఇష్టమన్నాడు. దర్శకుడు బాబీ గురించి చెప్పాలంటే అతడు బలుపు టైంలో పరిచయం అయ్యాడని.. ఆ తర్వాత కథ చెప్పి ఒప్పించి పవర్ చూపించాడని.. ఈ సినిమాతో నెక్ట్స్ లెవల్‌కు వెళ్తాడని తన ప్రగాఢ విశ్వాసం అని రవితేజ అన్నాడు. డీఎస్పీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని.. అతడి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఆరు సినిమాలు చేశానని.. అన్నీ సినిమాల్లో తనకు సూపర్ హిట్ పాటలు ఇచ్చాడని ప్రశంసించాడు. దేవిశ్రీ ఎనర్జీ చూస్తే తనకు కూడా డ్యాన్స్ వేయాలని అనిపించిందని చెప్పాడు. ఈ సంక్రాంతి ముమ్మాటికీ మైత్రీ వాళ్లదే అని రవితేజ స్పష్టం చేశాడు. నిర్మాత నవీన్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారని.. ఆ లక్షణం తనకు ఎంతో ఇష్టమన్నాడు. ఈ సినిమాకు ఇలాంటి ఫంక్షన్‌లు చాలా జరుగుతాయని రవితేజ జోస్యం చెప్పాడు.

Exit mobile version