Director Bobby: చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు.. బెండు తీయడానికి పవన్ వచ్చాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Director Bobby: మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వాల్తేరు వీరయ్య. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ నేడు వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. తన కల నెరవేరిందని, 39 ఏళ్లుకి తన కల నెరవేరడం ప నుంచి తన తండ్రి చూసి సంతోషిస్తారని అనుకుంటున్నానని చెప్పాడు. చిరంజీవి గారి గురించి చెప్పాలంటే మాటలు చాలవని చెప్పిన బాబీ ఆయనను డైరెక్ట్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాని అన్నాడు. ఇక తన తండ్రి చనిపోయిన మూడో రోజునే షూటింగ్ చేశానని, అది కూడా తన నాన్న గారు చెప్పడం వలనే చేసినట్లు చెప్పాడు.
ఇక చిరంజీవి గురించి బాబీ చెప్తూ.. ” మెగాస్టార్ కు కోపం ఎందుకు రాదు.. ఎవరెవరో మాట అనేస్తే తిరిగి మాట ఎందుకు అనరు అంటే ఒక రోజు అయన ఒక మాట చెప్పారు. అవతలోడు అన్నాడు అని మనం అనేస్తే వాడికి తల్లిదండ్రులు ఉంటారు, భార్యాబిడ్డలు ఉంటారు, చెల్లెలు ఉంటారు.. వాళ్ళు బాధపడతారు బాబీ అన్నాడు.. ఎలా వచ్చిందో తెలియదు మీకు ఈ గుణం.. నిజంగా మీకు రాజకీయాలకు వెళ్ళినప్పుడు మళ్లీ మీతో చేయలేనేమో అనుకున్నాను.. కానీ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉండేది. బట్ మీకు రాజకీయాలు వన్ పర్సెంట్ కూడా కరెక్ట్ కాదు అన్నయ్య. మీకు దేవుడు ఒక తమ్ముడిని ఇచ్చాడు.. అతను చూసుకుంటాడు.. అతను సమాధానం చెప్తాడు. అతడు గట్టిగా నిలబడతాడు. మీలో నుంచి వచ్చిన ఆవేశం, మంచితనం కలగలిపితే పవర్ స్టార్. అతను మాటకు మాట సమాధానమిస్తాడు. పవన్ తో నేను కలిసి పనిచేశాను.సేమ్ మంచితనం” అని చెప్పుకొచ్చాడు. ఇక సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి గురించి చెప్పుకొస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపాడు. ఒక అభిమానిగా రికార్డు డైలాగ్ రాసినట్లు చెప్పిన బాబీ, అది చిరుకు మాత్రమే సెట్ అవుతుందని చెప్పుకొచ్చాడు. రవితేజ తో రెండు సినిమాలు చేశాను..ఆయన అడగగానే ఒప్పుకున్నారు.. ఆ సమయంలో రవికి షూటింగ్ ఉంటే తరువాత పెట్టుకుందామని విలువ ఇచ్చేవారని తెలిపాడు. ఈ సినిమా ఒక పెద్ద సంక్రాంతి పండుగ అని, దీని జాతర జనవరి 13 న మొదలై ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేమని చెప్పుకొచ్చాడు.
Also Read
తాజావార్తలు
-
India vs Japan: భారత్, జపాన్ మధ్య చారిత్రాత్మక టీ20.. ‘స్నేహం కొత్త ఇన్నింగ్స్’ అంటూ జపాన్ అంబాసిడర్ పోస్ట్.!
-
PM Modi 76th Birthday: ప్రధాని మోడీ బర్త్‌డే స్పెషల్.. 2,500 దీపాలతో 25 అడుగుల సైకత శిల్పం..
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
-
Mahesh Babu: వారణాసి తర్వాత.. వాట్ నెక్స్ట్.?
-
Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!