Mass Jathara : మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా నేడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించారు. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ‘నేను నా ఫ్యామిలీ ఎలా బతకాలి, రేపు ఇంటి కిరాయి ఎలా కట్టాలి, పిల్లలను ఎలా చదివించుకోవాలి, రేపు ఎలా గడపాలి అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వచ్చింది. నన్ను కాదేమో అనుకున్నా. కానీ నన్నే అని చెప్పారు.
Read Also : Mass Jathara : రవితేజను తిట్టే సీన్ లో అలా అన్నారు.. శ్రీలీల ఫన్నీ స్పీచ్
అదే ధమాకా సినిమా కోసం నన్ను తీసుకున్నారు. ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే.. ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయి అనే పొజీషన్ లో ఉన్నాను. నేను, నా ఫ్యామిలీ అందరం కలిసి ఒకేసారి చనిపోదాం అనుకునన్నాం. నా ఫ్యామిలీని నేను ఓ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. అలాంటి సమయంలో ఒక దేవుడిలాగా రవితేజ కనిపించాడు. నా కోసం నిలబడ్డ వ్యక్తి, శక్తి పేరు రవితేజ. రవితేజ వల్లే ఇలా నిలబడి ఉన్నాను. నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను. ధమాకా సినిమా వల్లే నాకు గుర్తింపు వచ్చింది. ఇప్పుడు చిరంజీవి గారితో సినిమా చేస్తున్నాను. ఆయన వల్లే నేను ఇలా నిలదొక్కుకున్నాను. నా లాంటి వాళ్లను ఎంతో మందిని ఆయన ఎంకరేజ్ చేస్తుంటారు. ఆయన గురించి మాటల్లో చెబితే ప్రేమ.. పాటలో చెబితే భక్తి అవుతుంది అని ఎమోషనల్ అయ్యాడు భీమ్స్.
Read Also : Rashmika : అప్పుడే చెప్తా.. విజయ్ తో ఎంగేజ్ మెంట్ పై రష్మిక రియాక్ట్
