NTV Telugu Site icon

RT 75 : రవితేజ.. BVSరవి.. కిషోర్ తిరుమల.. కాంబోలో సినిమా ఫిక్స్..

Rt75

Rt75

రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్  కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చేస్తున్నాడు. రీసెంట్లీ వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా రవి కెరీర్ లో 75 వ  సినిమాగా రానుంది.  పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. మరింత యంగ్‌గా, ఎనర్జటిక్‌గా మెస్మరైజ్ చేశాడు.

Also Read : Dil Raju : విజయ్ దేవరకొండ ‘ రౌడీ జనార్ధన్’

ధమాకా తర్వాత శ్రీలీల జోడీకడుతున్న మాస్ జాతరను మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కాగా రవితేజ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. BVS రవి అందించిన కథతో క్లాస్ డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రవితేజ. మాస్ జాతర కంప్లీట్ కాగానే  కాస్త గ్యాప్ ఇచ్చి కిశోర్ తో వర్క్ చేస్తాడని టాక్. నేను శైలజ, ఉన్నటీ ఒకటే జిందగీ, చిత్రలహరి, ఆడాళ్లు మీకు జోహార్లు చిత్రాలతో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను అందించిన కిశోర్ తిరుమలలో ఓ మాసీ డైరెక్టర్ కూడా ఉన్నాడు. రామ్ పోతినేనికి రెండు క్లాస్ హిట్లు ఇచ్చిన ఇదే డైరెక్టర్ రెడ్ లాంటి ఊరమాస్ సినిమా తీసి హ్యాట్రిక్ హిట్ అందించాడు. సో ఇప్పుడు కూడా అటు ఫ్యామిలీ, ఇటు మాస్ కథతోనే రవితేజతో సినిమా చేస్తున్నాడు. BVS రవి స్ట్రిప్ట్ నచ్చి కిశోర్ కు ఆ స్క్రిప్ట్ పై తుదిమెరుగులు దిద్ది ఒకే చేసినట్టు తెలుస్తోంది. తర్వలోనే ఈ  సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చకా చకా కంప్లీట్ చేసి 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. మరీ వేరే రైటర్ వండిన కథతో సినిమా చేస్తున్న కిషోర్ రవితేజకు ఎటువంటి హిట్ ఇస్తాడో చూడాలి.