Raviteja : మాస్ మహారాజా రవితేజ మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి మూవీ టైటిల్ చాలా యూనిక్‌గా ఉంది. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. టైటిల్ తోనే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్ జీపీటీ, జెమినీ, ఏఐ.. ఇలా అన్నింటినీ అడిగారు. బహుశా వాటికి పెళ్లి కాకపోవడం వల్ల ఆన్సర్ చెప్పలేకపోయాయేమో’ అనే రవితేజ డైలాగ్ బాగుంది.
Read Also : OG : ఆ విషయంలో ఓజీ డైరెక్టర్ గ్రేట్.. పరుచూరి కామెంట్
భార్యలు, భర్తల మధ్య జరిగే ఫన్నీ ఇన్సిడెంట్స్ తో మూవీ తీస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డైలాగ్ హాస్యభరితంగా ఉండడంతో పాటు, రవితేజ మార్క్ కామెడీ మరోసారి రిపీట్ అవుతున్నట్టు తెలుస్తోంది. టైటిల్, డైలాగ్, మ్యూజిక్, సినిమా భార్యాభర్తల మధ్య జరిగే చిన్నచిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ ను హాస్యాత్మకంగా చూపించబోతుందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. రవితేజ గత సినిమాల్లోని ఎనర్జీ, కిషోర్ తిరుమల యొక్క సాఫ్ట్ ఎమోషనల్ స్టోరీటెల్లింగ్ కలిస్తే ఈ మూవీకి మంచి హిట్ అవకాసం ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
Read Also : Chiranjeevi – Ram Charan : మొన్న చిరంజీవి.. నేడు రామ్ చరణ్.. అదరగొట్టారుగా..
