Site icon NTV Telugu

Ravi Kishan: ‘రేసుగుర్రం’ విలన్ ఇంట విషాదం..

ravi kishan

ravi kishan

ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ అవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన అన్న రమేష్ శుక్లా కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయన చికిత్స తీసుకుంటూనే బుధవారం మృతిచెందినట్లు రవి కిషన్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపారు. ” అన్న ప్రాణాలు కాపాడడానికి వైద్యులు ఎంతగానో ప్రయత్నించారు. కానీ నా అన్నను కాపాడలేకపోయారు. ఇటీవలే తండ్రిని పోగొట్టుకున్న నేను ఇప్పుడు తండ్రి లాంటి అన్నాను కూడా పోగొట్టుకున్నాను. నా కుటుంబం అనాథలా మారిపోయింది. అన్నను కోల్పోవడం నా కుటుంబానికి తీరని లోటు.. అన్న నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ ఎమోషనల్ ట్వీట్ పోస్ట్ చేశారు. ఇక దీంతో రవి కిషన్ ను ఓదారుస్తూ పలువురు ప్రముఖులు రమేష్ శుక్లాకు సంతాపం తెలియజేశారు.

ఇకపోతే రవికిషన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రేసు గుర్రం చిత్రంలో విలన్ గా ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అంతేకాకుండా ఇటీవల గోరఖ్​పుర్​ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొంది సంచలన విజయం అందుకున్న విషయం విదితమే.

Exit mobile version