NTV Telugu Site icon

Ravi Kiran Kola: అందుకే ఆ సినిమాకు షో రన్నర్ గా…..

Ravi

Ravi

Ravi Kiran Kola:

‘రాజావారు రాణిగారు’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రవికిరణ్ కోలా. ప్రస్తుతం రవి కిరణ్ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. జూలై 20 తన పుట్టిన రోజును పురస్కరించుకుని, చిత్రసీమలోకి అడుగుపెట్టిన వైనాన్ని ఆయన మీడియాకు వివరించారు. ”మాది తూర్పు గోదావరి ఏలేశ్వరం మండలంలోని భద్రవరం అనే చిన్న విలేజ్. చిన్నప్పటి నుండి సినిమాపై వున్న ప్యాషన్ తో డైరెక్టర్ అవ్వాలని 2016 లో హైదరాబాద్ వచ్చాను. నేను రాసుకున్న కథను చెప్పడానికి బోలెడంత ప్రయత్నం చేశాను. అయితే నాకు పరిచయం తక్కువ కావడంతో చాలా కష్టపడాల్సి వచ్చింది. అదే సమయంలో స్వచ్ఛ భారత్ పై యాంకర్ రవితో ‘దిల్ సే’ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. దీనికి మంచి అప్లాజ్ వచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి లెర్నింగ్ ఎక్స్ పీరియన్స్ అయ్యింది. ఆ తరువాత మ్యూజిక్ డైరెక్టర్ జై ద్వారా కిరణ్ అబ్బవరం పరిచయమయ్యాడు. మొదట వెబ్ సిరీస్ చేద్దాం అనుకోని తక్కువ బడ్జెట్ లో 15 మంది టీం తో ఈస్ట్ గోదావరి కెళ్ళి షూట్ చేశాం. అయితే కథ బాగుందని, ఫీచర్ ఫిల్మ్ లా ఉందని టీం అంతా ప్రోత్సహించారు. నాకు, కిరణ్ కు అది మొదటి సినిమా అవ్వడంతో ఎంతో కేర్ తీసుకొని తీసిన చేసిందే ‘రాజావారు రాణిగారు’. సురేష్ ప్రొడక్షన్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాకుండా మంచి విజయం సాధించింది” అని అన్నారు.

 

ఇక ఇటీవల విడుదలైన విశ్వక్ సేన్ మూవీ ‘అశోక వనంలో అర్జున్ కళ్యాణం’కు తాను షో రన్నర్ గా ఎందుకు వ్యవహరిచాల్సి వచ్చిందో కూడా రవికిరణ్ కోలా తెలిపాడు. ”ప్రస్తుతం నేను మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ లో ఓ సినిమా చేయబోతున్నాను. అయితే నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. వాటి ద్వారా కొత్త వారికి దర్శకులుగా అవకాశం ఇవ్వాలనుకున్నాను. అయితే ‘అశోక వనంలో అర్జున్ కళ్యాణ్‌’ చిత్ర బృందం నన్ను షో రన్నర్ గా వ్యవహరించమని కోరింది. ఈ సినిమాకు కథ, మాట‌లు, స్క్రీన్ ప్లే అందించాను. సాధారణంగా నేషనల్, ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ కు మాత్రమే షో రన్నర్స్ ఉంటారు. షో రన్నర్ అనేది మన సినిమాలకు కొత్త. ఫస్ట్ టైం షో రన్నింగ్ కాన్సెప్ట్ ను యస్.వి.సి.సి. డిజిటల్ వారు తీసుకొద్దాం అనుకొని  ‘అశోకవనంలో…’ సినిమాకు షో రన్నర్ గా ఉండమన్నారు. షో రన్నర్ అంటే  దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది. సినిమాకి సంబంధించిన పూర్తి క్రియేటివిటీ రెస్పాన్స్ బిలిటీ ని తీసుకోవడమే దీని ఉద్దేశం” అని చెప్పారు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా వర్క్ జరుగుతోందని, .దీంతో పాటు ఎస్‌వీసీసీ బ్యానర్ లో ఇంకో సినిమా చేయబోతున్నానని, అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా రెడీగా ఉందని రవికిరణ్ కోలా తెలిపారు.

Show comments