Site icon NTV Telugu

Raveena Tondon: తండ్రికి అంతిమ సంస్కారాలు చేసిన స్టార్ హీరోయిన్

raveena tondon

raveena tondon

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్‌(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ అయ్యారు. ” ప్రతి క్షణం నువ్వు నాతోనే ఉంటావు నన్ను, నువ్వే దగ్గరుండి అడుగు వేయిస్తావ్ ” అంటూ కన్నీటి పర్యంతమైంది. రవి టాండన్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version