మాస్ మహారాజా రవితేజ రెండు సాలిడ్ హిట్స్ అందుకోని హ్యాట్రిక్ కొట్టడానికి ‘రావణాసుర’గా ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. గ్రే షేడ్ లో రవితేజ నటించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న రావణాసుర సినిమా రవితేజ హిట్ స్ట్రీక్ ని బ్రేక్ వేసింది. 23 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రావణాసుర సినిమా ఓవరాల్ గా అన్ని సెంటర్స్ లో కలిపి పది కోట్ల నష్టాన్ని మిగిలించింది. సుధీర్ వర్మ మేకింగ్ కి, రవితేజ యాక్టింగ్ కి మంచి పేరొచ్చింది కానీ సినిమా మాత్రం నెగటివ్ రిజల్ట్ ని ఫేస్ చేసింది అందుకే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ సినిమా ఒటీటీలోకి వచ్చేస్తోంది.
Read Also: Akhil: ఏజెంట్ రాక కోసం అభిమానుల వెయిటింగ్…
జనరల్ గా అయితే థియేటర్స్ రిలీజ్ అయిన ఒక మూవీ ఎనిమిది వారాల వరకూ ఒటీటీలోకి రిలీజ్ అవ్వడానికి లేదు, రావణాసుర సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టే అనుకున్న దాని కన్నా ముందే ఈ సినిమాని ఒటీటీలో రిలీజ్ చెయ్యనున్నారు. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం మే 5న రావణాసుర సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ విషయమై చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ త్వరలో రానుందట. మరి థియేటర్స్ లో డిజప్పాయింట్ చేసిన రావణాసుర సినిమా ఒటీటీ అయినా మంచి వ్యూవర్షిప్ ని రాబడుతుందేమో చూడాలి.