NTV Telugu Site icon

Rathika: రతిక- రాహుల్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసింది అతనే.. నిజం బయటపెట్టిన రతిక సోదరి

Rathika

Rathika

Rathika: బిగ్ బాస్ అన్ని సీజన్స్ లో ఈ సీజన్ లో జరిగినంత రచ్చ ఇంకే సీజన్ లో జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. పర్సనల్ విషయాలు చెప్పుకోవడం.. వాటి వలన నామినేషన్స్జరగడం .. బయటికి వెళ్ళినవారు మళ్లీ లోపలికి వెళ్లడం.. ఇలా జరగడం.. ఇదే మొదటిసారి. ఇక ఇదంతా కేవలం రతికా విషయంలోనే జరిగింది. పటాస్ షో ద్వారా కెరీర్ ప్రారంభించిన ప్రియ.. కొద్దిగా పేరు వచ్చాకా రతికా రోజ్ గా పేరు మార్చుకుంది. ఆతరువాత కొన్ని షోస్ లలో, సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ హౌస్ కు వెళ్లకముందే.. కొన్ని ఆల్బమ్స్ లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసినటించింది . అప్పుడే అతడితో ప్రేమలో పడింది. ఇక ఏవో కారణాల వలన వీరిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన రతికా.. తన ప్రేమ విషయాన్ని దామినికి చెప్పింది. ఆమె నామినేషన్ లో చెప్పడంతో బయట రచ్చ అయ్యింది. ఇక అదే సమయంలో రతిక- రాహుల్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ అయ్యాయి. ఇక రాహుల్.. తనకు ఏం సంబంధం లేనట్లు.. ఓట్లు కోసం చిల్లర పనులు చేస్తున్నారని ఇన్ డైరెక్ట్ రతికపై ఫైర్ అయ్యాడు.

Nani: అక్కడ నేను తమిళ్ అబ్బాయి.. ఇక్కడ కార్తీ తెలుగబ్బాయి

ఇక తాజాగా రతిక సోదరి.. రతిక, రాహుల్ ల ప్రేమ వ్యవహారం బయటపెట్టింది. ” రతిక- రాహుల్ ప్రేమించుకున్న మాట నిజమే. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కూతురు ఆనందం కోసం మా నాన్న కూడా పెళ్ళికి ఒప్పుకున్నాడు. ఆ సమయంలోనే రాహుల్.. రతికకు కండిషన్స్ పెట్టాడు. తనను పెళ్లి చేసుకున్నాక సినిమా ఇండ‌స్ట్రీలోకి వెళ్ల‌కూడ‌దు, అక్క‌డ ప‌ని చేయ‌కూడ‌దు అని చెప్పాడు. ఆ కండీష‌న్స్ ర‌తిక‌కు న‌చ్చ‌లేదు. ఇద్ద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చాకే బ్రేక‌ప్ చెప్పుకున్నారు. ఇక రతిక- రాహుల్ ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేసింది కూడా రాహులే అని అనుకుంటున్నాను. రతిక బిగ్ బాస్ హౌస్ లోఉంది.. ఆమె ఫోన్ కూడా ఆమె దగ్గర లేదు. వారి ప్రైవేట్ ఫోటోలు వారి దగ్గర కాకుండా వేరేవారి దగ్గర ఎందుకు ఉంటాయి. ఖచ్చితంగా ఆమె పరువు తీయడానికే రాహులే ఆ ఫోటోలను లీక్ చేసి ఉంటాడు” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.