Nani: కోలీవుడ్ హీరో కార్తీ తన 25వ చిత్రంగా జపాన్ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ దీపావళి కానుకగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం.. నేడు హైదరాబాద్ లో జపాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా విచ్చేశాడు.
iBOMMA : ఐబొమ్మకు డైరెక్టర్ వార్నింగ్.. దమ్ముంటే ఆ పని చేసి చూపించండి
ఇక ఈ వేదికపై నాని మాట్లాడుతూ.. “జపాన్ ప్రీ రిలీజ్ కు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఈగ సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యకా.. ఎప్పుడైనా చెన్నై వెళితే.. అక్కడ ఉన్నవారందరూ.. నన్ను మా తమిళ్ అబ్బాయిలా ఉన్నావని అనేవారు. అయితే.. అక్కడనుంచి ఇక్కడకు వచ్చినవారులో తెలుగు అబ్బాయిలా ఎవరైనా కనిపిస్తారు అంటే అది కార్తీనే. ఆయన ఫేస్ కానీ, లుక్ కానీ.. లేకపోతే ఎంచుకొనే సినిమాల వలన కానీ.. కార్తీని తెలుగు అబ్బాయిలా ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. గతేడాది మూడు వరుస హిట్లతో ప్రేక్షకులను అలరించాడు. ఇక ఇప్పుడు జపాన్ అనే మరో కొత్త కథతో వస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్ చూసాను. చాలా కొత్తగా ఉంది. అలా మొదలైంది సినిమా సమయంలో మేము కలిసాం. ఇక జెర్సీ సినిమా చూసి నాకు కాల్ చేశాడు కార్తీ. అతను సినిమా నుంచి నాకు ఫ్రెండ్.. ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షల” అని చెప్పుకొచ్చాడు.