Site icon NTV Telugu

Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..

Vijay Deverakonda, Rashmika Mandanna,

Vijay Deverakonda, Rashmika Mandanna,

Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న తిరుపతిలో జరిగింది. ఇందులో విజయ్ మాట్లాడుతూ ఈ మూవీ హిట్ అయితే టాప్ లో పోయి కూర్చుంటా అంటూ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా రష్మిక ఈ మూవీ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కింగ్ డమ్ గురించి విజయ్ చేసిన ట్వీట్ ను ఆమె రీ ట్వీట్ చేసింది. ఈ మూవీని చూడటానికి వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో విజయ్ ఫైర్ చూడాలని ఉందంటూ తెలిపింది. విజయ్, అనిరుధ్, గౌతమ్ చేసే మ్యాజిక్ చూసేందుకు వెయిట్ చేస్తున్నట్టు తెలిపింది.

Read Also : Shekhar Kammula : కృష్ణవంశీ నన్ను రిజెక్ట్ చేశాడు.. శేఖర్ కమ్ముల సీక్రెట్ రివీల్..

ఆమె ట్వీట్ కు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. రష్షీలు.. ఈ మూవీని నువ్వు ఎంజాయ్ చేస్తావ్ అంటూ రాసుకొచ్చాడు. విజయ్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అంటే రష్మికను ముద్దుగా అలా పిలుస్తాడని అంతా కామెంట్లు పెడుతున్నారు. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి. విజయ్ కూడా తనకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెబుతున్నాడు. తాను సింగిల్ కాదని హింట్ ఇచ్చాడు. వీరిద్దరూ ఎన్నో సార్లు సీక్రెట్ గా టూర్ వేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. మరి అఫీషియల్ గా ఎప్పుడు వాళ్ల రిలేషన్ ను బయట పెడుతారో చూడాలి.

Read Also : Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?

Exit mobile version