NTV Telugu Site icon

Rashmika Mandanna: రష్మిక చేస్తున్న మూడు సినిమాలకు ఈ సిమిలారిటీ గమనించారా?

Rshmika Mandannna

Rshmika Mandannna

Rashmika Mandanna reveals the one common thread between her upcoming projects: సౌత్, నార్త్ అని తేడా లేకుండా నేషనల్ క్రష్ గా మారిపోయిన రష్మిక మందన్న తన రాబోయే ప్రాజెక్ట్‌లు D-51, యానిమల్, రెయిన్‌బో అలాగే పుష్ప 2 మధ్య ఒక సిమిలారిటీ గురించి కామెంట్ చేసింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎక్కువగా డిమాండ్ ఉన్న హీరోయిన్లలో రష్మిక మందన్నా ఒకరు. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా ఆమె మిలియన్ల మంది హృదయాలలో చెరగని ముద్ర వేసింది. పుష్ప దెబ్బతో క్రేజ్ పెరగడంతో ఆమె చేతిలో ఇప్పుడు చాలా అద్భుతమైన ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అయితే రష్మికను మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద ఎప్పుడు చూస్తామా అని అభిమానులు చాలా ఆత్రంగా ఉన్నారు. తాజాగా ట్విట్టర్ లో రష్మిక తన ఫాలోవర్స్ ట్వీట్ లకి స్పందించింది. అభిమానుల్లో ఒకరు ఆమె రాబోయే చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్ గురించి అడిగారు.

MAD: ‘మ్యాడ్’గాళ్లు సైలెంటుగా వచ్చేస్తున్నారు..

అందులో, “రషూ మీ రాబోయే చిత్రాలకు సంబంధించి ఏవైనా అప్‌డేట్‌లు ఉన్నాయా ? వాటి విషయంలో వేచి ఉండలేను , పుష్ప 2, D51, యానిమల్‌లో మిమ్మల్ని చూడటానికి వేచి ఉండలేకపోతున్నాను రష్మిక మందన్న అని పేర్కొన్నాడు. దానికి ఆమె బదులిస్తూ, “ఈ సినిమాలన్నిటి గురించి నేను చెప్పగలిగే ఒక కామన్ విషయం ఏమిటంటే – ఈ అన్ని సినిమాలు పిచ్చెక్కిస్తాయి. ఈ సినిమాలన్నీ బహుభాషా చిత్రాలు అని ఆమె చెప్పుకొచ్చింది. రష్మిక మన్దన్న తదుపరి రణబీర్ కపూర్ సరసన ‘యానిమల్’, అల్లు అర్జున్ సరసన పుష్ప 2, ధనుష్ సరసన D51 సినిమాతో పాటు ఆమె సోలో లీడ్ చిత్రం ‘రెయిన్‌బో’లో నటించనుంది.

Show comments