Rashmika : విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ఎప్పటి నుంచో డేటింగ్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. రీసెంట్ గానే వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అందులో ఎంత వరకు నిజం ఉందనేది ఇంకా వీరిద్దరూ చెప్పట్లేదు. ఎన్ని రూమర్లు వస్తున్నా వీరిద్దరూ వాటిని అస్సలు పట్టించుకోరు. తమ సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంటారు. వీరిద్దరూ. అయితే ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉంది. ఆమె ఇంటర్వ్యూలలో మాట్లాడే స్లాంగ్ ను చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
Read Also : Rashmika : ప్రభాస్ తో చేస్తే నా కెరీర్ ఎక్కడికో వెళ్తుంది.. రష్మిక కామెంట్
ఎందుకంటే రష్మిక చాలా వరకు విజయ్ దేవరకొండ స్టైల్ లోనే మాట్లాడుతోంది. తెలంగాణ యాస ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. విజయ్ లాగే కొన్ని కామెంట్లు చేస్తోంది. లాంగ్వేజ్ స్లాంగ్, ఆ ఎక్స్ ప్రెషన్లు, మాట్లాడే తీరు అంతా విజయ్ లాగే ఉంది. ఇది చూసిన వారంతా విజయ్ అన్నను రష్మిక ఫాలో అవుతోంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరేమో విజయ్ ఏం మందు పెట్టాడో.. పూర్తిగా ఆయనలాగే మాట్లాడుతోంది రష్మిక అంటున్నారు. మొత్తానికి రష్మిక చేస్తున్న పనులతో విజయ్ ట్రెండింగ్ లోకి వచ్చేస్తున్నాడు.
Read Also : Bigg Boss 9 : నువ్వు వెళ్లిపో.. తనూజపై భరణి ఫైర్.. తండ్రి, కూతుర్ల ఫైట్