NTV Telugu Site icon

Rashmika : బ్యూటీ సీక్రెట్ రివీల్… ఇవే తింటుందట నేషనల్ క్రష్ !

Rashmika Mandanna

Rashmika Mandanna

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అందమైన, పాపులర్ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. రష్మిక చాలా యాక్టివ్ సోషల్ మీడియా యూజర్… మిలియన్ల కొద్దీ అభిమానులతో పాన్ ఇండియా స్టార్ గా దూసుకెళ్తోంది. పెంపుడు జంతువుతో స్పెండ్ చేస్తూ పలు వీడియోలు, ఫొటోలతో సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. వర్కౌట్ రొటీన్‌తో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటుంది. అయితే ఈ అమ్మడి అందానికి గల కారణం ఏమై ఉంటుందా ? అని చాలామంది ఆలోచించే ఉంటారు. అంతేనా అసలు ఆమె డైట్ ఏంటి? ఏం తింటుందో అని తెలుసుకోవడానికి ఉబలాటపడేవారూ తక్కువేం కాదు. అలాంటి వారికోసమే అన్నట్టుగా ట్విట్టర్ లో రష్మిక తన ఒక్కరోజు డైట్ ను రివీల్ చేసింది. ఈ వీడియోలో ఆమె షూటింగ్ సెట్స్‌లో ఉన్నట్లుగా కనిపించింది. షూటింగ్ లో ఉన్నప్పుడు ఆమె మొదట ఐస్‌డ్ కాఫీ, సెలెరీ జ్యూస్‌ని సేవించింది. తర్వాత భోజనం బాదం వెన్నతో కూడిన ఓట్స్ , సాయంత్రం టీని ఆస్వాదించింది. రాత్రి భోజనంలో చికెన్, మ్యాషుడ్ పొటాటోస్ ను తినేసింది. అయితే ఇది ఒక్కరోజు డైట్ మాత్రమే.

Read Also : Sarkaru Vaari Paata : నెవర్ బిఫోర్… కథ చెప్పేసిన ఎడిటర్

ఇక రష్మిక మందన్న… సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్పై-థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’లో కనిపించనుంది. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘గుడ్ బై’ మూవీలో కూడా కనిపించబోతోంది. ఇక తెలుగులో “పుష్ప”, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న “తలపతి 66” నటించనుంది. మరోవైపు దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ “సీతా రామం” చిత్రంలో కూడా ఆమె అతిధి పాత్రలో నటిస్తోంది.

Show comments