The Girlfriend : రష్మిక మంధాన, దీక్షిత్ శెట్టి జంటగా నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ విడుదలైన తర్వాత మంచి స్పందన అందుకుంటోంది. ఈ సందర్భంగా రష్మిక సినిమా సక్సెస్‌కి ధన్యవాదాలు తెలుపుతూ ఓ ఎమోషనల్ లవ్ లెటర్‌ను పంచుకుంది. ఆ లెటర్‌లో రష్మిక మాట్లాడుతూ “‘అమ్మాయివి నీకేం తెలుసు’ అనే మాటలు మనకు చాలా సార్లు వినిపిస్తాయి. కానీ నేటి అమ్మాయిలు తమకేం కావాలో బాగా తెలుసుకుంటున్నారు. నేనూ ఆ దశలోంచే వచ్చాను. నాకు కూడా అలాంటి అవమానాలు ఎదురయ్యాయి. కానీ వాటిని తట్టుకుని ముందుకు వచ్చాను.
Read Also : Pawan Kalyan: అధికారుల పని తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి!
ఈ సినిమా ప్రతి అమ్మాయి మనసును తాకుతుంది. ఈ సినిమాను ఎంతో కష్టపడి చేశాను. అమ్మాయిలు ఎదుర్కుంటున్న సమస్యలే ఇందులో కీలకం. ఇదంతా లవ్ స్టోరీ మూవీ అనుకుంటున్నారు. కానీ ఇందులో ఒక అమ్మాయిగా తనకేం కావాలి.. తాను తెలుసుకోవాల్సింది ఏంటి అనేది చూపించాం” అని చెప్పింది. ఇక రష్మిక నటన, రాహుల్ రవీంద్రన్ సున్నితమైన కథనం, రొమాంటిక్ ఎమోషన్‌ల మేళవింపుతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. రష్మికకు ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు రావాలంటూ అల్లు అరవింద్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. మరి గర్ల్ ఫ్రెండ్ కమర్షియల్ గా ఏ మేరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి.
Read Also : SSMB 29 : పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇదేంటి ఇలా ఉంది
