NTV Telugu Site icon

Rashmika: నడవలేని స్థితిలో రష్మిక.. ఎయిర్ పోర్టులో వీడియో వైరల్

Untitled Design (20)

Untitled Design (20)

ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ రష్మిక .‘యానిమల్’,‘పుష్ప 2’ లతో ఆమె బ్రాండే మారిపోయింది. ప్రస్తుతం విక్కీ కౌశల్ ‘ఛావా’ మూవీతో ఆడియెన్స్‌ను పలకరించేందుకు రెడీగా ఉంది. కానీ చేతినిండా వరుస ప్రాజెక్ట్ లు ఉన్నప్పటికి, పాపం షూటింగ్ లో పాల్గొనే పరిస్థితిలో లేదు రష్మిక. ప్రజంట్ అని షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చింది. ఎందుకంటే రీసెంట్ గానే తనకు జిమ్‌లో చేసిన వర్కౌట్లతో కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా రష్మిక తెలిపింది.

దీంతో నేను కోలుకోడానికి ఎంత టైం పడుతుందో తెలియడం లేదని.. ప్రస్తుతం షూటింగ్‌లకు రాలేనని తన దర్శకులందరికీ కూడా సారీ చెప్పింది. మళ్లీ కాలు సెట్ అయిన తరువాత షూటింగ్‌లకు వస్తానని రష్మిక తెలిపిందట. అయితే తాజాగా రష్మిక మందన్న వీల్ చైర్ లో ప్రత్యక్షమైంది. బుధవారం (జనవరి 22) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె కనీసం నడవలేక పోతుంది. కారు దిగేటప్పుడు కూడా ఒంటి కాలితో ఇబ్బంది పడుతూ నడిచారు. కానీ దెబ్బ తగిలిన కాలు కనీసం కింద కూడా పెట్టలేకపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ముందు కాలు పట్టి చూసి గాయం చిన్నదేనని అనుకున్నాం.. కానీ ఎయిర్ పోర్టులో రష్మిక పరిస్థితి చూస్తుంటే గాయం పెద్దదిగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక వీడియో చూసిన ఫ్యాన్స్‌ షాక్‌ అవుతున్నారు..త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో బయటకు ఎందుకు వచ్చింది? ఎక్కడికి వెళ్తోంది? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆమెను ఇలా చూడలేకపోతున్నాం అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.