Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక.. మేనేజర్ పై ఫైర్ అయ్యిందని, అతడిని వెంటనే ఉద్యోగంలోనుంచి తీసేసిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా డబ్బులు అడిగితే తాను ఇచ్చేదాన్ని అని, ఇలా నమ్మక ద్రోహం చేయడం తనకు నచ్చదని క్లాస్ తీసుకుందని కూడా ఆ వార్తల సారాంశం. ఇప్పటివరకు ఈ వార్తలపై రష్మిక కానీ, మేనేజర్ కానీ స్పందించింది లేదు. అయితే తాజాగా ఈ వార్తలపై రష్మిక స్పందించింది. మేనేజర్ మోసం చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ఆమెతో పాటు మేనేజర్ సైతం వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు అని చెప్పుకొచ్చారు.
Karthi: కార్తీ బుగ్గకు తన బుగ్గను ఆనించి మరీ ఫోటో దిగిన ఈ సుందరాంగిని గుర్తుపట్టారా..?
“మా మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మేము స్నేహపూర్వకంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మా మేనేజర్ మోసం చేశాడు.. అందుకే విడిపోతున్నామన్న పుకార్లలో నిజం లేదు. మేము పూర్తిగా ప్రొఫెషనల్స్.. పనికి కట్టుబడి ఉంటాం. ఎవరికి వారు విడిగా ఎదగాలనుకుంటున్నాం” అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడింది. అయితే ఇందులో కూడా నిజం ఎంత అనేది మాత్రం ఎవరికి తెలియదు. నిజంగా మేనేజర్ మోసం చేయకపోతే ఇంత సడెన్ గా మేనేజర్ ను మార్చాల్సిన అవసరం ఏమొస్తుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం రష్మిక.. పుష్ప 2, యానిమల్ సినిమాల్లో నటిస్తోంది.