Site icon NTV Telugu

Rashmika: స్టేజ్ పైనే రష్మికను అవమానించిన సుకుమార్.. మరి అంత దారుణంగానా

sukumar

sukumar

గీతాగోవిందం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తరువాత వెనక్కి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి పాన్ ఇండియా మూవీలో నటించే వరకు వచ్చింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం శర్వానంద్ సరసన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 4 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఆడవాళ్ళు మీకు జోహార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన సుకుమార్..రష్మికను స్టేజ్ పైనే అవమానించడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ వేదికపై సుకుమార్ మాట్లాడుతూ “ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన యంగ్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్ లను ప్రసంశలతో ముంచెత్తాడు. అంతేకాకుండా అస్సలు వేడుకకే రాని సమంతను సైతం పొగిడి ఆకాశానికి ఎత్తేశాడు. కానీ, పక్కనే ఉన్నరష్మికను మర్చిపోయాడు. మర్చిపోవడమే కాదు.. అక్కడే ఉన్న రష్మికని నీ పేరేంటి? అని అడిగి అవమానించాడు.. మళ్లీ వెంటనే రష్మిక మందన్నా అంటూ ఆయనే చెప్పి.. ఆమె గొప్ప నటి” అంటూ పొగిడేశారు. అయితే ఇదంతా అక్కడ జోక్ గా జరిగినా ఈ సంభాషణను నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక పుష్ప సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇంకా పుష్ప 2 కూడా సెట్స్ మీద ఉంది. అలా తనతో వర్క్ చేసే హీరోయిన్ పేరును సుక్కు ఎలా మర్చిపోతాడు.. అక్కడ ఆమెను అంతగా ఆట పట్టించడానికి కూడా లేదు.. వేరే హీరోయిన్ల ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడడం కాకపోతే ఏంటి అని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది పద్దతి కాదు సుక్కు అంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.

Exit mobile version