Rashmika : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అటు రష్మిక పాన్ ఇండియా సినిమాలతో చాలా బిజీ అయిపోయింది. ఈ ఇద్దరి గురించి ఏ చిన్న మ్యాటర్ లీక్ అయినా సోషల్ మీడియా ఊగిపోతుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ లెక్కలేనన్ని రూమర్లు వస్తున్నాయి. పైగా ఇద్దరూ బయటకు వెళ్లిన ప్రతిసారి దొరికిపోతున్నారు. కానీ రిలేషన్ మీద ఎవరూ మాట్లాడట్లేదు. అయితే తాజాగా రష్మిక సైమా అవార్డుల కోసం దుబాయ్ కు వెళ్లింది. ఆ ఈవెంట్ లో తన వేలికి ఓ రింగ్ పెట్టుకుంది. అది చూసిన వారంతా.. ఆమె ఎంగేజ్ మెంట్ విజయ్ తో అయిపోయిందని కామెంట్లు పెడుతున్నారు. ఇది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది.
Read Also : Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ వచ్చేసినట్టే..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికకు ఈ విషయంపై ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ.. అది జస్ట్ నా సెంటిమెంట్ ఉంగరం. నాకు ఎవరితోనూ ఎంగేజ్ మెంట్ జరగలేదు. ఒకవేళ నిజంగానే ఎంగేజ్ మెంట్ అయితే నేనే స్వయంగా చెబుతాను. అప్పటి వరకు ఎవరూ ఇలాంటివి నమ్మొద్దు అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. కానీ విజయ్ తో తన రిలేషన్ పై డైరెక్ట్ గా బయట పెట్టలేదు. మొత్తానికి అమ్మడి కామెంట్స్ చూస్తుంటే నిజంగానే విజయ్ తో రిలేషన్ లో ఉందని తేలిపోతోంది. ఇక వీరిద్దరూ త్వరలోనే ఓ సినిమాలో కనిపించబోతున్నారంటూ తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు దిల్ రాజు నిర్మాణంలో సినిమాలు చేస్తున్నాడు.
Read Also : Mirai : మనోజ్ కు కలిసొచ్చిన మోహన్ బాబు ఫార్ములా