Rashmi Gautham: బుల్లితెర యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ యాంకర్ గా అమ్మడికి బాగానే పేరు ఉంది. ఇక ఒకపక్క షోస్ చేస్తూనే ఇంకోపక్క సినిమాలతో దుమ్మురేపుతోంది. అమ్మడి కెరీర్ విషయం పక్కన పెడితే.. ఎన్నో ఏళ్లుగా రష్మీ పెళ్లి వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. సుధీర్ – రష్మీ ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయితే సుధీర్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని రష్మీ ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. ఆ రొమాన్స్ అంతా కెమెరా వరకే అని, సుధీర్ ను పెళ్లి చేసుకొనే ఉద్దేశ్యం తనకు లేదని కూడా తెలిపింది. అయినా కూడా అభిమానులు మాత్రం రష్మీ కనిపించిన ప్రతిసారి పెళ్లి ఎప్పుడు.. ? సుధీర్ అన్నతోనేనా.. ? అనే ప్రశ్నలు అడగకుండా వదలడం లేదు. అయితే కొత్త ఏడాది రష్మీ తన అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతుందని తెలుస్తోంది. కొత్త ఏడాది రష్మీ పెళ్లి వార్త చెప్పబోతుందంట.
ఈటీవీ లో ప్రతి ఈవెంట్ కు ఏదో ఒక థీమ్ తో వస్తారు. ఇలా చాలాసార్లు.. రష్మీ పెళ్లి చేసేశారు.. సుధీర్ పెళ్లి చేశారు. మళ్లీ మరోసారి రష్మీ పెళ్లి థీమ్ తో ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. జనవరి 1 న న్యూ ఇయర్ పార్టీకి రష్మీ పెళ్లి కబురు అని ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు. ఆ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అందరు రష్మీని పెళ్ళెప్పుడు.. పెళ్ళెప్పుడు అని అడుగుతుండగా.. రష్మీ.. చెప్తా.. చెప్తా అని చెప్పుకొచ్చింది. చివరికి డిసెంబర్ 31 నైట్ మీ అందరికి నా పెళ్ళెప్పుడు అనేది చెప్తా.. అని చెప్పుకొచ్చింది. మరి ఈసారైనా అమ్మడు పెళ్లి పీటలు ఎక్కుతుందా.. ? ఇది కూడా ఈవెంట్ కోసమే అని చెప్పి షాక్ ఇస్తుందో చూడాలి.