NTV Telugu Site icon

Rashmi Gautam: టాప్ పొజిషన్ కి రావాలంటే వారితో పడుకోవాలి.. రష్మీ పోస్ట్ వైరల్

Rashmi Gautam

Rashmi Gautam

బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ ప్రస్తుతం వరుస షోస్ తో సినిమాలతో బిజీగా తయారయ్యింది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మ తన మనసుకు బాధ కలిగించే విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. జంతువులకు హాని చేసినా, మహిళలను కించపరిచేలా మాట్లాడిన రష్మీ తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటుంది. ఇక తాజాగా రష్మీ సినీ పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై గళమెత్తింది.

ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని ఎంతమంది తారలు వెల్లడించారు. అవకాశాలు రావాలన్నా, టాప్ హీరోయిన్ కావాలన్నా.. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ తో పడుకోవాలి అని చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంపై రష్మీ స్పందించింది. టాప్ పొజీషన్ కు చేరుకోవడానికి ఆమె ఖచ్చితంగా పడుకుని వుంటుందని అంటుంటారు అంటూ సాగే ఒక మీమ్ ని షేర్ చేస్తూ.. “అవును..చాలామందికి ఇలా అనడం సులభం” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అంటే అలా అనడం చాలా ఈజీ కానీ అక్కడ ఉన్నవారికి మాత్రమే ఆ బాధ తెలుస్తోంది అనే విధంగా రష్మీ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.