NTV Telugu Site icon

NTR: దేవర టైటిల్ కి ఏజెంట్ పాత్రకి అసలు సంబంధం ఉందా బాసూ?

Ntr

Ntr

సోషల్ మీడియాలో కొన్ని సార్లు అర్ధం లేని రూమర్స్ వినిపిస్తూ ఉంటాయి. అవి ఎక్కడ నుంచి ఎలా స్టార్ట్ అవుతాయో తెలియదు కానీ అందరినీ నమ్మించే అంత నిజంలా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇవి విని కాస్త లాజికల్ గా ఆలోచిస్తే అసలు ఇది జరిగే పనే కాదు అని తెలిసిపోతుంది. ఇలాంటి వార్త ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా గురించి వినిపిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ‘జాన్వీ కపూర్’ నటిస్తోంది. జాలరి అమ్మాయి పాత్రలో జాన్వీ కనిపించనుంది, హీరోయిన్ అనౌన్స్మెంట్ సమయంలో మేకర్స్ ట్రెడిషనల్ హాఫ్ సారీలో ఉన్న జాన్వీ కపూర్ ఫోటోని కూడా రిలీజ్ చేసారు.

జాన్వీ కపూర్ అసలు జాలరి అమ్మాయి కాదు, అది అంతా డ్రామా… ఆమె రా ఏజెంట్, ఎన్టీఆర్ కి ట్రాప్ చేయడానికి అలా వచ్చింది అంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ వైరల్ అయ్యింది. దీంతో ఈ రూమర్ పై అసలు ఈ విషయం కొరటాల శివకైనా తెలుసో లేదో అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఫర్గాటెన్ ల్యాండ్స్ లో, రాక్షసుల కన్నా భయంకరమైన మనుషులు ఉన్న ప్రాంతంలో… భయానికి భయం పుట్టించే వీరుడిగా ఎన్టీఆర్ కనిపిస్తాడు అనే విషయాన్ని కొరటాల శివ క్లియర్ గా చెప్పేసాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా దేవర సినిమా రూపొందుతుంది, ఇప్పటికే రిలీజ్ చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కూడా ఆ యాంగిల్ లోనే డిజైన్ చేసారు. ఇవన్నీ కాదు అసలు దేవర అనే టైటిల్ కి, హీరోయిన్ ‘రా ఏజెంట్’ అనే మాటకి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. మరి ఇలాంటి రూమర్ ఎక్కడ ఎలా పుట్టిందో? హీరోయిన్ ని రా ఏజెంట్ గా ఎందుకు మార్చారో ఆ రూమర్స్ స్ప్రెడ్ చేసే వాళ్లకే తెలియాలి.

Show comments