Ranveer Singh: నగ్న ఫోటోషూట్.. ఆ ఫోటోని మార్ఫింగ్ చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh Says One Of His Photo Was Morphed: ఇటీవల బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ చేసిన విషయం తెలిసిందే! ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడమే ఆలస్యం.. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగింది. దేశంలో మరే సమస్య లేనట్టుగా.. ఈ ఫోటోషూట్ మీదే చర్చలు జరిగాయి. న్యూస్ ఛానెళ్లలో డిబేట్ల మీద డిబేట్లు పెట్టేశారు. కొందరు ఇతనికి మద్దతుగా దిగొచ్చి, నగ్న ఫోటోలు షేర్ చేశారు. తామూ ఈ ట్రెండ్‌లో పాలు పంచుకుంటున్నామంటూ.. తమ అర్ధనగ్న ఫోటోల్ని పోస్ట్ చేశారు. కానీ, రణ్‌వీర్ సింగ్ ఫోటోషూట్‌పై అభ్యంతరాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ముంబై పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా రణ్‌వీర్ ఫోటోషూట్ ఉందని మహిళ సంఘాలు చేసిన ఫిర్యాదు మేరకు.. ఐపీసీలోని 509, 292, 294 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని 67ఏ కింద కేసు బుక్ చేశారు.
ఈ క్రమంలోనే కేసు విచారణకు రణ్‌వీర్ సింగ్ ఇటీవల హాజరయ్యాడు. ఈ విచారణలో భాగంగా.. తనకు చెందిన ఫోటోల్లో ఒక ఫోటోని ఎవరో ట్యాంపర్ చేసి, మార్ఫింగ్ చేశారని పేర్కొన్నాడు. తాను షేర్ చేసిన ఏడు ఫోటోల్లో ఒక ఫోటో మాత్రం లేదని తెలిపాడు. ఈ సందర్భంగా తాను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలను పోలీసులకు అందించాడు. ఇదిలావుండగా.. రణ్‌వీర్ ఇచ్చిన ఈ వాంగ్మూలంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ‘‘ఎవరో రణ్‌వీర్ సింగ్ అకౌంట్‌ని హ్యాక్ చేసి, అతడి ఫోటోలను మార్ఫ్ చేసి, పోస్ట్ చేసినట్టున్నారు’’ అంటూ నెటిజన్లు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
Also Read
తాజావార్తలు
-
Sharannavaratri Special: శరన్నవరాత్రుల్లో ప్రత్యేక ఆకర్షణ.. కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి విశేష అలంకరణ!
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..