NTV Telugu Site icon

Prasanth Varma: బాలీవుడ్ స్టార్ హీరోని ఫిదా చేసిన ప్రశాంత్ వర్మ

Prasanth Varma

Prasanth Varma

Ranveer Singh In a Big Budget Movie With Hanu Man Director Prasanth Varma:’హనుమాన్’ జనవరి 2024లో థియేటర్లలో విడుదలై బంపర్ వసూళ్లు రాబట్టడంతో అందరూ ఆశ్చర్యపోయారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. అప్పటి నుంచి ‘హనుమాన్‌’కి సీక్వెల్‌పై చర్చలు జరుగుతున్నాయి. ‘హనుమాన్’ సీక్వెల్ జై హనుమాన్ కోసం రణవీర్ సింగ్‌తో ప్రశాంత్ వర్మ చర్చలు జరుపుతున్నట్లు కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ప్రశాంత్ వర్మ కూడా అందుకు ఊతం ఇస్తూ రణవీర్ సింగ్‌ని చాలాసార్లు కలిశాడు. అయితే ఇప్పుడు కొత్త అప్ డేట్ తెర మీదకు వచ్చింది. అదేమంటే ప్రశాంత్ వర్మ, రణవీర్ సింగ్ కలయికలో వస్తున్నది ‘హనుమాన్’ సీక్వెల్ సినిమా కాదని, ఒక మెగా బడ్జెట్ సినిమా కోసం అని తెలుస్తోంది. ఇదొక పీరియాడికల్ డ్రామా అని, ఇందులో రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ‘పింక్‌విల్లా’ రిపోర్ట్ ప్రకారం, రణవీర్ సింగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ పనికి పెద్ద అభిమాని అయిపోయాడని, ‘హనుమాన్’ విడుదలైన వెంటనే అతన్ని కలిశాడని పేర్కొంది.

Tillu Square: టిల్లు గాడికి బ్రేకుల్లేవ్.. ఈరోజుకి ఎన్ని కోట్లు కొల్లగొట్టాడంటే?

హనుమాన్ చూడగానే ప్రశాంత్ వర్మ విషయంలో రణవీర్ సింగ్‌ ఇంప్రెస్ అయ్యాడు. గత 3 నెలలుగా ప్రశాంత్ వర్మ భారీ బడ్జెట్ చిత్రం కోసం రణ్‌వీర్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఒక సోర్స్ తెలిపిందని రిపోర్ట్ పేర్కొంది. పలుమార్లు వీరి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. ఓ రకంగా చెప్పాలంటే రణవీర్ సినిమాకు ఓకే చెప్పేశాడు. ఇప్పుడు సినిమా టీం పని మొదలు పెట్టడానికి ప్రీ ప్రొడక్షన్ కూడా మొదలుపెట్టిందని అంటున్నారు. ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్, స్క్రిప్ట్, స్క్రీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం రణ్‌వీర్‌కు బాగా నచ్చాయని అంటున్నారు. రణవీర్ మరియు ప్రశాంత్ వర్మ కలిసి చాలా పెద్ద స్టూడియోలతో మాట్లాడుతున్నారని, అన్నీ అనుకున్నట్లు జరిగితే, త్వరలోనే సినిమాని ప్రకటించనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాతో పాటు రణవీర్ సింగ్ ‘సింగం ఎగైన్’, ‘డాన్ 3’ చిత్రాల్లో కనిపించనున్నాడు. ఈ లెక్కన జై హనుమాన్ జనవరి 2025కి ప్రేక్షకుల ముందుకు రావడం కష్టమే అని చెప్పొచ్చు.

Show comments