Site icon NTV Telugu

Dhurandhar 2: సొంత భర్త సినిమాకు రాని దీపిక.. అసలేం జరుగుతోంది!

Deepika Padukone

Deepika Padukone

బాలీవుడ్ స్టార్ కపుల్ రణవీర్ సింగ్, దీపికా పదుకొణె మధ్య ఏదో జరుగుతోందా? గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ చూస్తుంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్నా, దీపికా పదుకొణె మాత్రం సైలెంట్‌గా ఉండటం ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. రణవీర్ సింగ్ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌కు దీపిక హాజరుకాకపోవడం గమనార్హం. అయితే, ఆ మరుసటి రోజే ఆమె తన అత్తమామలతో కలిసి ముంబైలో ఒక ప్రైవేట్ కాన్సెర్ట్‌లో కనిపించడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. “సొంత భర్త సినిమా ఫంక్షన్‌కు రాని దీపిక, మరుసటి రోజే బయట ఈవెంట్లలో ఎలా కనిపిస్తుంది? అసలు వీరి మధ్య అంతా సవ్యంగానే ఉందా?” అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

Also Read : Dhurandhar 2: పాపం…. ధురంధర్ 2 దెబ్బకి వణికిపోతున్న పాక్ లీడర్

సాధారణంగా రణవీర్ సినిమా వస్తుందంటే దీపిక సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తుంది. 2025 డిసెంబర్‌లో ‘ధురంధర్’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆమె భర్త నటనను ఆకాశానికెత్తుతూ వరుస పోస్టులు పెట్టింది. కానీ, పార్ట్ 2 విడుదలై మూడు రోజులు గడుస్తున్నా, ఆమె నుండి కనీసం ఒక చిన్న స్టోరీ కూడా రాకపోవడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “గాజా ఇష్యూ లేదా జేఎన్ యూ (JNU) వివాదాల మీద పెద్ద పెద్ద పేరాగ్రాఫ్లు రాసే దీపికకు, తన భర్త సినిమా విజయాన్ని అభినందించడానికి టైం లేదా?” అంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ సినిమా దర్శకుడు ఆదిత్య ధర్ గతంలో దీపిక వర్కింగ్ అవర్స్ గురించి చేసిన కామెంట్స్ ఆమెకు నచ్చలేదని, అందుకే ఆమె ఈ సినిమాకు దూరంగా ఉంటుందని ఒక టాక్. ఒకవేళ రణవీర్ సినిమాను ఓపెన్‌గా సపోర్ట్ చేస్తే, భవిష్యత్తులో ఖాన్’ల సినిమాల్లో తనకు అవకాశాలు తగ్గుతాయని దీపిక భయపడుతోందనే వింత వాదనలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో జేఎన్ యూ పర్యటన, దుబాయ్‌లో దావూద్‌ను కలిశారనే రూమర్లను గుర్తు చేస్తూ మరికొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

Exit mobile version