Ranveer Singh: దీపికా పదుకొనే భర్తపై కేసు నమోదు.. ఆ చంఢాలాన్ని డిలీట్ చేయాలంటూ డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranveer Singh: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన ఫ్యాషన్ తో నిత్యం వార్తల్లో కనిపించే రణవీర్ తాజాగా చేసిన ఒక ఫోటో షూట్ కొంప ముచ్చింది. ఇటీవల రణవీర్ నగ్న ఫోటోషూట్ ను చేసిన విషయం విదితమే. 1972లో కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కోసం పాప్ ఐకాన్ బర్ట్ రెనాల్డ్స్‌కు నివాళిగా రణవీర్ ఈ న్యూడ్ ఫోటో షూట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా రణవీర్ నగ్నంగా ఫోజులిచ్చి రచ్చ లేపాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక రణవీర్ ట్రెండ్ అంటూ అతడిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది హీరోలు తమ నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. దీంతో నెటిజన్స్ ఛీ ఛీ ఏంటి ఈ ఛండాలం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక మరికొంతమంది ప్రముఖులు సైతం ఈ ట్రెండ్ ను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా పలువురు హీరోయిన్లు.. ఇలాంటి పని మేము చేస్తే సమాజం ఊరుకుంటుందా..? అంటూ నిలదీస్తున్నారు.
ఇక తాజాగా రణవీర్ నగ్న ఫోటోషూట్ వివాదానికి దారితీసింది. రణవీర్ పై ఒక ఎన్జీవో సంస్థ ముంబై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. నగ్న ఫోటోషూట్ తో రణవీర్ మహిళల మనోభావాలను దెబ్బతీశారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. వెంటనే ఆ ఛండాలమైన ఫోటోలను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. ఒకరిని చూసి మరొకరు ఇలాగే చేస్తారని, ఈ ట్రెండ్ అందరికి పాకకముందే తుంచివేయాలంటూ నెటిజన్స్ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఫోటోషూట్ పై నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి ఘాటుగా స్పందించారు. ఇలాంటి ఒక ఫోటోషూట్ ఒక హీరోయిన్ చేస్తే సమాజం మొత్తం వారికి ఎదురు తిరిగేదని, ఈపాటికి ఆమె ఇల్లును పెద్దలు ధ్వంసం చేసేవారని చెప్పుకొచ్చింది. ఏదిఏమైనా ఒక స్టార్ హీరో ఇలాంటి పనులు చేసి సమాజానికి ఏం మెసెజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై ఈ హీరో ఎలా స్పందిస్తాడో చూడాలి. ఇక ఇప్పటివరకు ఈ ఫోటోషూట్ పై రణవీర్ భార్య, హీరోయిన్ దీపికా నోరు విప్పింది లేదు.. మరి అమ్మడు భర్తకు సపోర్ట్ గా ఉంటుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read
తాజావార్తలు
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
-
Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..