Site icon NTV Telugu

హీరోయిన్ తో వైష్ణవ్ తేజ్ బటర్ ఫ్లై కిస్… రొమాంటిక్ వీడియో

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, పంజా వైష్ణవ్ తేజ్ మూడో సినిమా టైటిల్ ను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. రొమాన్స్‌తో కూడిన వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ కొత్త చిత్రానికి “రంగ రంగ వైభవంగా” అనే టైటిల్ ను పెట్టారు. టైటిల్‌ను ప్రకటించేందుకు మేకర్స్ వైష్ణవ్ తేజ్, కేతికా శర్మలతో ఉన్న రొమాంటిక్ టీజర్‌ను విడుదల చేశారు. టైటిల్ తో పాటు వీడియో కూడా ఆసక్తికరంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను చిత్రబృందం త్వరలో తెలియజేస్తుంది.

Read Also : లక్ అనేదే లేదు… ‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్

ఈ చిన్న టీజర్లో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ బటర్‌ ఫ్లై కిస్ అనే కొత్త రకం ముద్దును ఉద్వేగభరితంగా పంచుకున్నారు. ఈ వీడియో యూత్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ వీడియోలో రొమాంటిక్ ఎమోషన్ ను ఎలివేట్ చేసింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి శ్యామ్‌ దత్ సినిమాటోగ్రఫీ అందించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, ‘కొండపొలం’ సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Exit mobile version