NTV Telugu Site icon

Charles Sobhraj: సీరియల్ కిల్లర్ ప్లేస్ లో సినిమా యాక్టర్ ఫోటో వేశారు…

Charles Shobaraj

Charles Shobaraj

ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ ని విడుదల చేస్తూ నేపాల్ కోర్ట్ తీర్పునిచ్చింది. నేపాల్ దేశంలోని సెంట్రల్ జైలు నుంచి జీవిత‌కాల శిక్ష ఎదుర్కొంటున్న శోభ‌రాజ్‌ రిలీజైయ్యాడు. విడుదలైన 15 రోజుల్లోగా అతన్ని దేశం నుంచి బహిష్కరణకు నేపాల్ కోర్టు ఆమోదం తెలిపింది. 2003లో నేపాల్‌ దేశంలో ఇద్దరు అమెరికన్ టూరిస్టులను హత్య చేశాడనే ఆరోపణలపై శోభరాజ్ అరెస్టయ్యాడు. నేపాల్ దేశ కోర్టు శోభరాజ్ కు జీవిత ఖైదు విధించింది. శోభరాజ్ తల్లిదండ్రులు వియత్నాం, ఇండియన్ లు. ఇతను ఫ్రెంచి పౌరుడని నేపాల్ పోలీసులు చెప్పారు. 78 ఏళ్ల శోభరాజ్ పలు హత్య ఘటనలకు పాల్పడ్డాడని పోలీసులు వివరించారు.

Read Also: Charles Sobhraj: ఆయనకు 64, ఆమెకు 21.. సీరియల్ కిల్లర్‌తో మూడుముళ్ళు..

ఇదిలా ఉంటే ఈ సీరియల్ కిల్లర్ న్యూస్ ని కవర్ చేస్తూ ‘ది టైమ్స్ ఆఫ్ ఇండియా’ రాసిన ఒక ఆర్టికల్ లో ఘోరమైన తప్పిదం చేసింది. ఈ ఆర్టికల్ లో శోభరాజ్ అనుకోని సినిమా యాక్టర్ ‘రణదీప్ హూడా’ ఫోటోని అటాచ్ చేశారు. డిసెంబర్ 22న బయటకి వచ్చిన ఈ పేపర్ చూడగానే రణదీప్ హూడా షాక్ అయ్యి, సోషల్ మీడియాలో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నాడు. “Is that a back handed compliment @timesofindia or did you genuinely get confused between the “real” and “reel” Charles Sobhraj ?” అంటూ రణదీప్ హూడా ట్వీట్ చేశాడు. ఇంతకీ అసలు టైమ్స్ ఆఫ్ ఇండియా అంతటి వాళ్లు రణదీప్ హూడాని చార్లెస్ శోభరాజ్ అని ఎందుకు కన్ఫ్యూస్ అయ్యారు అంటే 2015లో రణదీప్ హూడా ‘మెయిన్ అవుర్ చార్లెస్’ అనే సినిమాలో నటించాడు. చార్లెస్ శోభరాజ్ జీవితంలోని కొన్ని సంఘటనలని తీసుకోని ఈ సినిమాని రూపొందించారు. ఇందులో రణదీప్ హూడా, చార్లెస్ శోభరాజ్ లుక్ ని యాజ్ ఇట్ ఈజ్ గా దించేసాడు. ఈ కారణంగానే రణదీప్ హూడాని చార్లెస్ శోభరాజ్ అనుకోవాల్సి వచ్చి ఉంటుంది. 


Read Also: Charles Sobhraj: జైలు నుంచి బయటకు వచ్చిన బికినీ కిల్లర్