Site icon NTV Telugu

Ranbir Kapoor: ‘షంషేరా’ చూసేందుకు నాన్న ఉంటే బాగుండు.. రణ్‌బీర్ భావోద్వేగం

Ranbir Kapoor Wishes Dad Rishi Kapoor Were Alive To Watch Shamshera

Ranbir Kapoor Wishes Dad Rishi Kapoor Were Alive To Watch Shamshera

త్వరలోనే ‘షంషేరా’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు బాలీవుడ్ స్టార్ రణ్​బీర్​కపూర్. జులై 22న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలకానుంది. ఈ క్రమంలోనే తన తండ్రి రిషి కపూర్​ను తలచుకొని భావోద్వేగానికి గురయ్యారు రణ్​బీర్​. ఈ సినిమా చూడటానికి ఆయన బతికి ఉండి ఉంటే తాను ఎంతో సంతోషించేవాడనని అన్నారు.

‘షంషేరా’ చూసేందుకు నాన్న బతికి ఉంటే బాగుండు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పని నచ్చినా, నచ్చకపోయినా చాలా నిజాయతీగా చెప్పేవారని.. ఈ సినిమా ఆయన చూడలేకపోవడం చాలా బాధగా ఉందన్నారు. కానీ, ఇలాంటి చిత్రం చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని.. ఎక్కడ ఉన్నా ఆయన నా పట్ల గర్వంగా ఉంటారనే భావిస్తున్నానని రణ్‌బీర్​ తెలిపారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్‌ సన్నివేశాలతో టీజర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. పోరాట యోధుడు, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే ఒక వీరుడిగా రణ్‌బీర్‌ నటన, ఆహార్యం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాలో సంజయ్‌ దత్‌ ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.

Exit mobile version