Ranbir Kapoor: నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా?

Rabir Kapoor Box Office King

Rabir Kapoor Box Office King

ప్రభాస్ తర్వాత ఇండియన్ సినిమాలో నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ కింగ్ రణబీర్ కపూర్ అవుతాడా? ఒకవైపు రామాయణం, అనిమల్ పార్క్, లవ్ అండ్ వార్, మరొకవైపు బ్రహ్మాస్త్ర 2, ధూమ్ 4 అంటూ వరుసగా భారీ ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి. కానీ ఇన్ని బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటే సరిపోతుందా? లేక కలెక్షన్లు కూడా ఆ రేంజ్ లో రావాలా? ఇప్పటి వరకు రణబీర్ కెరీర్ లో నిజంగా పాన్ ఇండియా మార్కెట్ బిల్డ్ అయిందా లేక హైప్ మాత్రమే ఎక్కువైందా?
అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ లైనప్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. రామాయణం, లవ్ అండ్ వార్, అనిమల్ పార్క్ ఇలా వరుసగా భారీ సినిమాలు చేతిలో ఉన్నాయి. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. లైనప్ స్ట్రాంగ్ గా ఉండటం ఒక ఎత్తు అయితే, బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ రావడం మరో ఎత్తు. యానిమల్ ఒక్క సినిమాతో వచ్చిన మాస్ ఇమేజ్ మిగతా సినిమాలపై ఎక్స్పెక్టేషన్స్ ను అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఒక్క సినిమా మిస్ఫైర్ అయినా మొత్తం లైనప్ మీదే ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తోంది.

రామాయణం కోసం వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్, గ్లోబల్ రిలీజ్, హాలీవుడ్ VFX అంటూ భారీ పెట్టుబడి పెట్టడం జరిగింది. కానీ ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం బడ్జెట్ కు తగ్గ స్థాయిలో కనిపించడం లేదు. చివరికి ఈ సినిమా పూర్తిగా థియేట్రికల్ కలెక్షన్స్ మీద ఆధార పడాల్సిన పరిస్థితి. కంటెంట్ కనెక్ట్ కాకపోతే బడ్జెట్ బిగ్గెస్ట్ ప్రెజర్ గా మారే ప్రమాదం ఉంది. హైప్ ఎంత పెద్దదైనా ఆడియన్స్ ఫైనల్ వర్డ్ ఒక్కటే నిర్ణయిస్తుంది.

యానిమల్ సక్సెస్ తర్వాత అనిమల్ పార్క్ మీద ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. కానీ సీక్వెల్స్ అన్నీ సక్సెస్ అవుతాయి అని గ్యారెంటీ లేదు. మొదటి భాగంలో ఉన్న ఎమోషన్ వాల్యూ, ఫ్రెష్నెస్ రెండో భాగంలో రిపీట్ కాకపోతే ఆడియన్స్ వెంటనే రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. అదే సమయంలో లవ్ అండ్ వార్ పూర్తిగా క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. రెండు విభిన్న జానర్ల సినిమాలు రెండు చోట్లా సక్సెస్ సాధించాల్సిన ప్రెజర్ ఇప్పుడు రణబీర్ పైనే ఉంది.

2022 లో విడుదలైన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ దాదాపు 430 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఆ కథను మరింత ఎలాబరేట్ చేస్తూ రాబోతోంది బ్రహ్మాస్త్ర పార్ట్ 2. రణబీర్ కపూర్, రామాయణం షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే మొదటి భాగంపై వచ్చిన స్క్రీన్ ప్లే విమర్శలను దాటుకొని ఈసారి బలమైన కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను మెప్పించగలిగితే బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉంటుంది. అందుకే రణబీర్ లైనప్ ఎంత పవర్ఫుల్ అయినా ప్రతి సినిమా ఇండివిడ్యువల్ గా ప్రూవ్ చేసుకోవాల్సిందే.