NTV Telugu Site icon

Rana : ‘విరాటపర్వం’లో పాట పాడిన రానా

New Project (17)

New Project (17)

ఇప్పటి వరకూ తాను పోషించిన పాత్రలు ఎవరూ చేయలేనివనే భావిస్తున్నానంటున్నారు రానా. రానా నటించిన 1980 బ్యాక్ డ్రాప్ సినిమా ‘విరాటపర్వం’ ఈ నెల 17న విడుదల కానున్న నేపథ్యంలో మీడియాతో ముచ్చటించారు. ఇందులో రానా పాట పాడటం విశేషం. రానా పాడిన పాటను మీడియాకు వినిపించారు. ఇక తాను డాక్టర్ రవిగా, కామ్రేడ్ రవన్న గా నటించానని, సాయిపల్లవి వెన్నెల పాత్ర పోషించిందని చెప్పారు రానా. తన పాత్రను ఎవరితోనైనా ఫిలప్ చేయవచ్చేమో కానీ సాయిపల్లవి పోషించిన వెన్నెల పాత్రకు మాత్రం ప్రత్యామ్నాయం లేదన్నారు. ఇక తన పాత్ర సృష్టించిందే కానీ రియల్ లైఫ్ క్యారక్టర్ కాదని వివరించారు. పాండవులు ‘విరాటపర్వం’లో అజ్ఞాతవాసంలో ఉన్నట్లే ఇందులో కూడా వెన్నెల పాత్రతో పాటు పలు పాత్రలు అజ్ఞాతంలో ఉండి పోరాటం చేస్తాయని అందుకే దర్శకుడు టైటిల్ అలా పెట్టారని చెప్పారు రానా. లైఫ్‌ లో తొలిసారి పాట పాడటం గురించి వివరిస్తూ నిజానికి ఈ పాటను ముందు వేరే వారితో పాడించి కూడా సినిమాలో పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి నేనే పాడాలని సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి, దర్శకుడు వేణు పట్టుపట్టి పాడించారన్నాడు.

రానానాయుడు: బాబాయ్ వెంకటేశ్ తో కలసి నటించిన రానా నాయుడు వెబ్ సీరీస్ క్రైమ్ ఎలిమెంట్ తో కూడినదని తొలి సీజన్ షూటింగ్ పూర్తయిందంటూ మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయని తెలిపాడు రానా. అలాగే తన తమ్ముడు అభిరామ్ నటిస్తున్న ‘అహింస’ సినిమా వారం, పదిరోజులు మినహా పూర్తయిందని చెప్పాడు. సోలో హీరోగా నటించాలంటే తన హైట్ అటు హీరోయిన్స్ నుంచి విలన్స్ తోటి ఆర్టిస్ట్ లకు ఇబ్బందిగా ఉంటుందని అందుకే ప్రత్యేకమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నానన్నాడు.

2023 మార్చి నుంచి ‘హిరణ్యకశ్యప’: ఇక ఇప్పటికే ప్రకటించిన ‘హిరణ్యకశ్యప’ ఆగిపోలేదని త్వరలో ప్రారంభిస్తామని చెబుతూ తనకు సరైన పాత్ర అదని, 2023 మార్చినుంచి సెట్స్ పైకి వెళుతుందన్నాడు. ఇక పవన్ తో కలసి నటివంచిన ‘భీమ్లానాయక్’లో పాత్ర కూడా తనకు ఎంతో పేరు తెచ్చిపెట్టిందంటున్నాడు రానా. అలాగే ఇటీవల కాలంలో తను చూసిన సినిమాల్లో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ తనకెంతగానో నచ్చిందని చెప్పాడు.