Naresh-pavitra: సీనియర్ నటుడు నరేష్ పెళ్లి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మూడో భార్య రమ్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రా లోకేష్ ను పెళ్లి చేసుకుంటున్నాను అని అధికారికంగా చెప్పడంపై రమ్య సీరియస్ అయ్యింది. కొత్త ఏడాది పవిత్ర.- నరేష్ లిప్ లాక్ తో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక తనకు విడాకులు ఇవ్వకుండా వారు ఎలా పెళ్లి చేసుకుంటారో చూస్తానని రమ్య రఘుపతి శపథం చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నరేష్ బండారాన్ని బయటపెట్టింది. అతడు చేసే అరాచకాలను ఏకరువు పెట్టింది. కొడుకు ముందు నగ్న వీడియోలు చూడడం, లివింగ్ రిలేషన్స్, వన్ నైట్ స్టాండ్స్ అన్ని తనకు తెలుసనీ చెప్పుకొచ్చింది. ఇక ఏదైనా జరిగితే ఏడ్చుకుంటూ తన కాళ్ల మీద పడి సారీ అడుగుతాడని, అతడికి నాకు మనీ ప్రాబ్లెమ్ కాదని, నాకు నరేష్ కావాలి కానీ డబ్బు కాదని చెప్పుకొచ్చింది.
నరేష్ పరమ నీచుడని చెప్పుకొచ్చిన రమ్య.. తనకు ఎన్నో ఎఫైర్లను అంటగట్టినట్లు తెలిపింది. డ్రైవర్, అన్న, చివరికి తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తితో కూడా ఎఫైర్ అంటగట్టి కేసు పెట్టినట్లు తెలిపింది. ఇక తమ పెళ్లి గురించి రమ్య మాట్లాడుతూ.. ” నేను నరేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లి అయ్యాక.. నరేశ్ గురించి నాకు ఎన్నో విషయాలు తెలిశాయి. ఆయనకి వేరేవాళ్లతో సంబంధాలు ఉన్నాయని తెలిసి బాధపడ్డా. ఈ విషయాలపైనే ఆయన నాకెన్నోసార్లు క్షమాపణలు చెప్పాడు. ఇక పవిత్ర లోకేష్ సమ్మోహనం సినిమా అప్పుడు పరిచయమని విన్నాను. మా ఇంటికి తీసుకొచ్చి నాకు పరిచయం చేశాడు. మా ఎన్నికలు జరిగేటప్పుడు వారిపై నాకు అనుమానం వచ్చింది.కొంతకాలానికి అది నిజమైంది. ఇటీవల వాళ్లు షేర్ చేసిన వీడియో చూసి నాకు బాధగా అనిపించింది. సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేశారా? అనే అనుమానం కూడా ఉంది. నా కొడుకు కోసం ఆయనను భరిస్తున్నా.. ఈ విషయాల వలన వాడు చాలా కుంగుబాటుకు లోనవుతున్నాడు. నాకు విడాకులు ఇచ్చే ఉద్దేశ్యం లేదు. నేను ఇంకా పోరాటం చేస్తూనే ఉంటా.. వారిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారో నేనూ చూస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.