NTV Telugu Site icon

Ramana Gadi Rubabu: మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది

Guntur Karam

Guntur Karam

Ramana Gadi Rubabu: సూపర్ స్టార్ మహేష్ బాబు.. గతేడాది సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గుంటూరు కారం ఈ ఏడాది వస్తుంది అనుకున్నారు కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది బాబు థియేటర్ లో సందడి చేయలేదు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అందరూ.. బాబు ఎంట్రీ కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అందులోనూ.. గుంటూరు కారం సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. మెయిన్ గా త్రివిక్రమ్- మహేష్ కాంబోలో వస్తున్న మూడో సినిమా. అతడు, ఖలేజా తరువాత ఈ కాంబో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యింది. ఇక మహేష్ ఊర మాస్ లుక్, శ్రీలీల అందాలు.. మీనాక్షి చౌదరి .. ఇలా ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొనేలా చేశాయి. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ కానుంది. తిప్పి తిప్పి కొడితే ఇంకా 10 రోజులు కూడా లేదు సంక్రాంతికి.. కానీ, ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టలేదని అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. కానీ, కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదన్నట్లు.. మహేష్ సినిమా ప్రమోషన్స్ లేట్ గా స్టార్ట్ అయినా ట్రెండ్ సెట్ చేయడంలో మాత్రం లేటెస్ట్ అని ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో మహేష్ రమణగాడు గా కనిపిస్తున్నాడు. ఆ ఒక్కపేరుతో సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. పోస్టర్స్ తోనే మేకర్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చేస్తున్నారు. పోస్టర్ లు చూసి అభిమానులు ఆగుతారా.. ?. రమణగాడి రుబాబు అంటూ ట్విట్టర్ లో వైరల్ చేసేశారు. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు.. ఈ సంక్రాంతికి మొగుడు.. మా రమణగాడు వచ్చేస్తున్నాడు అంటూ చెప్పుకొస్తున్నారు. మార్కెట్ లో రమణగాడి రుబాబు చూస్తే మెంటల్ ఎక్కుతుంది అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి రమణగాడి రుబాబు ఎలా ఉంటుందో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.